Dist, Zonal wise state govt job vaccancies in telangana జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఖాళీల వివరాలివే..

Zonal district wise state government job vaccancies in telangana

CM KCR Government jobs announcement, KCR jobs announcement, Telangana unemployed youth, Telangana government jobs notification, Telangana contract workers, direct recruitment vacancies, Telangana district wise recruitment, telangana zonal wise recruitment, telangana multi zonal wise recuitment, Telangana other catageries recriutment, CM KCR, K Chandrashekhar Rao, Employment news, Government jobs, Telangana Assembly, Jobs Notification, Telangana, Politics

After Telangana CM KCR announces vaccancies in the state of Telangana, the aspirants show interest to know which district has high number of vaccancies and which Zone has the highest number and which the least. The details are here

జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఖాళీల వివరాలివే.. హైదరాబాద్‌ జిల్లాలో అధికం

Posted: 03/09/2022 01:37 PM IST
Zonal district wise state government job vaccancies in telangana

రాష్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభమైంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా, జోన్లు వారీగా, మల్టీ జోన్ల వారీగా ఎన్నెన్ని ఉద్యోగ ఖాళీలు వున్నాయో తెలుసుకునేందుకు ఔత్సాహికులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇందులో 39,829 పోస్టులు జిల్లాల్లో ఖాళీగా ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తామన్నారు. వాటికి సంబంధించిన నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు.

జిల్లాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 5,268 ఖాళీలు ఉండగా, 1,976 పోస్టులతో నిజామాబాద్‌, 1769 పోస్టులతో మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 556 పోస్టులు ఉండగా, రాజన్న సిరిసిల్లాలో 601 ఖాళీలు ఉన్నాయి. ఇందులో జోన్లు, మల్టీ జోన్లలో 32,036 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని ఏడు జోన్లలో 18,866 ఖాళీలు ఉండగా, మల్టీ జోన్లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

జిల్లాల వారీగా ఖాళీలు..

హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్లు..

కాళేశ్వరం జోన్‌లో- 1,630 (కుమ్రం భీం అసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు)
బాసర జోన్‌- 2,328 (ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు)
రాజన్న జోన్‌- 2,403 (కరీంనగర్, సిరిసిల్లా – రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు)
భద్రాద్రి జోన్‌- 2,858 (కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, హనుమకొండ జిల్లాలు)
యాదాద్రి జోన్‌- 2,160 (సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలు)
చార్మినార్ జోన్‌- 5,297 (మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు)
జోగులాంబ జోన్‌- 2,190 (మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు)

మల్టీజోన్లు..

మల్టీజోన్‌లో మొత్తం 13,170 పోస్టులు ఉన్నాయి.
మల్టీజోన్ 1- 6,800 (కాళేశ్వరం జోన్‌, బాసర జోన్, రాజన్న జోన్, భద్రాద్రి జోన్)
మల్టీజోన్ 2- 6,370 (యాదాద్రి జోన్‌, చార్మినార్ జోన్‌, జోగులాంబ జోన్‌)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles