సృష్టిలో బిడ్డలకు రక్షణ కవచంలా నిలిచే ఏదైనా శక్తి ఉందంటే.. అదే అమ్మ. పశ్చిమ బెంగాల్ లో ఏకంగా పెద్ద పులి తన బిడ్డలపైకి దూసుకోస్తుందని తెలిసి.. కొడవలి చేత బట్టిన ఓ తల్లి విరోచిత పోరాటం చేసి తన బిడ్డలను కాపాడుకుంది. అది అమ్మ గోప్పతనం. ఎంతటి ఆపద వచ్చినా తాను ఎదుర్కోంటుందే కానీ.. తన బిడ్డకు మాత్రం కష్టం రానివ్వదు. కానీ ఉత్తరాఖండ్ లోని ఓ తల్లి.. అమె చెల్లెళ్లు మాత్రం డబ్బు కోసం బిడ్డ మానానే పణ్ణంగా పెట్టారు. ఏకంగా తన బిడ్డను వ్యభిచార రోంపిలోకి దించారు. అక్కడితే ఆగకుండా మూడు పర్యాయాలు పెళ్లి చేశారు. ఈ తతంతమంతా మానసిక క్షోభను అనుభవించలేని బాధితురాలు పారిపోవడంతో వెలుగులోకి వచ్చింది.
ఉత్తరాఖండ్ ఉదంసింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ జిల్లా పరిధిలోని ఓ మహిళ అమ్మతనానికే అపఖ్యాతిని అపాదించింది. కుమార్తె బతుకును చక్కదిద్దాల్సిన తల్లే డబ్బు కోసం మూడుసార్లు వ్యభిచార రోంపిలోకి దింపి.. మూడు పెళ్లిళ్లు చేసింది. తన బిడ్డను మూడుసార్లు అమ్మేసింది. తర్వాత తిరిగి ఇంటికి చేరుకునేలా చేసుకుంది. ఈ విధంగా మరోసారి విక్రయించేందుకు ప్రయత్నించిందామె. అయితే ఈసారి నాటకీయంగా జరిగిన వ్యవహారంలో పోలీసులకు చిక్కింది. ఈ ఘటనకు సంబంధించి ఇరువై రోజుల క్రితం బాధితురాలి తల్లి.. తన సోదరిపై ఫిర్యాదు చేసింది.
తన సోదరి మిండ్రో.. తన కుమార్తెను తన స్నేహితురాలు రష్మీ ఇంటికి పని కోసం పంపమని తనను కోరిందని, ఇందుకోసం రష్మీ తన కుమార్తెకు డబ్బు చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చిందని తెలిపింది. దాంతో రుద్రపుర్‌లోని రష్మీ ఇంటికి నా కుమార్తెను పంపాను. కానీ 20 రోజుల తర్వాత నా కుమార్తె గురించి ఆరా తీస్తే.. ఆమెను మా సోదరి రూ.80,000కు విక్రయించినట్లు తెలిసింది" అని తన సోదరిపై ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాలిక తల్లి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఈ వ్యవహారంలో బాధితురాలి తల్లి కూడా ఉన్నట్లు తేలింది.
ఏడాదిన్నర కాలంగా ఆమె తన కూతురిని డబ్బు కోసం విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "మహిళ తన కుమార్తెను గత ఏడాదిన్నరగా రూ.200ల కోసం వ్యభిచారం చేయిస్తోంది. ఆమెకు మూడు పెళ్లిళ్లు కూడా చేసింది. మూడుసార్లు అమ్మేసింది. ఈసారి కూడా బాలికను విక్రయించింది. అయితే ఆ బాలిక.. విక్రయించిన ప్రదేశం నుంచి పారిపోకపోవడం వల్ల ఆ మహిళ తన సోదరిపై ఫిర్యాదు చేసింది" అని ఉదమ్సింగ్ నగర్ ఎస్పీ మమతా బోహ్రా తెలిపారు. ఈ కేసులో బాధితురాలి తల్లి, తన సోదరి సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more