Indian students turn up outside embassy in Kyiv భారతీయ విద్యార్థులకు సురక్షితంగా వసతి కల్పించిన ఎంబసీ

Ambassador of india to ukraine partha satpathy meeting with indian students in kyiv

ukraine russia news, what is happening in ukraine, Russian military operation against Ukraine, Indian ambassador to Ukraine, Partha Satpathy, Ukraine Russia Crisis, Indian students,russia ukraine, Ukraine crisis, Russia-Ukraine conflict, Ukrainian ambassador, Igor Polikha, Russia-Ukraine war, Ukraine-Russia crisis, Ukraine-Russia tension, Ukraine russia new, Prime Minister Narendra Modi,India on Ukraine, russia news, India

A large number of Indian students in Ukraine on Thursday turned up outside the Indian embassy in Kyiv seeking assistance after Russia launched a military operation targeting several Ukrainian cities. The students demanded the embassy to ensure their safety and security. Indian ambassador to Ukraine Partha Satpathy later interacted with the Indian students and assured all possible assistance.

భారతీయ విద్యార్థులకు సురక్షితంగా వసతి కల్పించిన ఎంబసీ

Posted: 02/25/2022 11:41 AM IST
Ambassador of india to ukraine partha satpathy meeting with indian students in kyiv

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వందల సంఖ్యలో భారత విద్యార్థులు రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కొందరికి ఎంబసీలో వసతి కల్పించారు. అలాగే సుమారు 200 మందికిపైగా విద్యార్థులను ఎంబసీ సమీపంలోని స్కూల్‌లో వసతి కల్పించినట్లు భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులోని పొరుగు దేశాల ద్వారా భారతీయల తరలింపుపై విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అయితే పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యమన్నారు. ప్రతి భారతీయుడు స్వదేశానికి చేరేవరకు ఎంబసీలో కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేశారని, దీంతో విపరీతమైన రద్దీ నేపథ్యంలో రోడ్లు, రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడిందని భారత రాయబారి పార్థ సత్పతి తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీయ పౌరులంతా ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. ప్రయాణాల్లో ఉన్న వారు నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కైవ్‌లో ఎవరైనా చిక్కుకున్నట్లయితే స్నేహితులు, కుటుంబాలు, భారతీయ సంఘం సభ్యులు, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఉక్రెయిన్‌లోని భారతీయుల భద్రత కోసం కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం 24 గంటలూ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles