India's stand on Russia-Ukraine crisis is Neutral రష్యా-ఉక్రెయిన్ దేశల మధ్య యుద్దంపై భారత్ స్పంధన ఇది

Russia ukraine crisis india s stand is neutral we hope for peaceful solution mos mea

ukrain russia news, what is happening in ukraine, russia ukraine, Ukraine crisis, Russia-Ukraine conflict, Ukrainian ambassador, Igor Polikha, Russia-Ukraine war,Ukraine-Russia crisis,Ukraine-Russia tension,Ukraine russia new,News on Ukraine,Russia News,Prime Minister Narendra Modi,India on Ukraine, russia news, India

Minister of State for External Affairs Dr RajKumar Ranjan Singh on Thursday said that India’s stance remains neutral on the issue of tensions between Russia-Ukraine. Russia launched a special “military operation” in Ukraine, warning that any attempt by countries to interfere with the action would lead to “consequences they have never seen”.

రష్యా-ఉక్రెయిన్ దేశల మధ్య యుద్దంపై భారత్ స్పంధన ఇది

Posted: 02/24/2022 07:23 PM IST
Russia ukraine crisis india s stand is neutral we hope for peaceful solution mos mea

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ ఆపరేషన్‌ అని పుతిన్‌ ప్రకటించినప్పటికీ.. అది యుద్ధంగానే ప్రపంచం భావిస్తోంది. ఇరు దేశాల పోటాపోటీ ప్రకటనలతో గందరగోళం నెలకొంది. ఆస్తి, ప్రాణ నష్టం ఇప్పుడప్పుడే ఒక అంచనాకి వచ్చే పరిస్థితులు లేవు. కనీసం వీలైనంత త్వరగా నష్టనివారణ చర్యలు చేపట్టాలని పాశ్చాత్య దేశాలపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఉక్రెయిన్ దేశ రాయబారి కూడా ఇక యుద్దంపై భారత్ జోక్యం చేసుకోవాలని అర్థించారు. ప్రధాని నరేంద్రమోడీతోనే యుద్దం అగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంపై భారత్‌ తన స్పందన వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ తటస్థ పాత్ర పోషిస్తుందని భారత్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ(స్టేట్‌) మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ మీడియాతో గురువారం మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ దేశాల యుద్దంపై స్పందించిన రాజన్‌ సింగ్‌.. భారత్‌ స్టాండ్‌ తటస్థం. శాంతియుత పరిష్కారాన్ని మేం ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారాయన. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని అనుకుంటున్నాం. అవసరమైతేనే భారత్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలనుకుంటోంది.

అప్పటిదాకా తటస్థంగానే ఉంటాం. ఒకవేళ కోరితే.. చర్చలకు వీలైన రీతిలో సాయం అందిస్తామ’ని చెప్పారాయన. ఇదిలా ఉంటే స్పెషల్‌ ఫ్లైట్‌ ద్వారా భారతీయులను(విద్యార్థులతో సహా) కొందరు ఇవాళ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం నుంచి ఉక్రెయిన్‌ను తూర్పు, ఉత్తరం, దక్షిణ వైపు నుంచి రష్యా బలగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో భయాందోళనల నడుమ ప్రజలు పశ్చిమానికి తరలిపోతున్నారు. మరోవైపు భారతీయులను సైతం పడమర వైపునే తరలించే ప్రయత్నాలు సాగుతున్నాయి. భారత్‌-ఉక్రెయిన్‌ నడుమ ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఎయిర్‌ ఇండియా మూడు ఫ్లైట్లను నడిపించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles