Isro's PSLV-C52 lifts off earth observation పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతం..

Isro s pslv c52 successfully launches earth observation and 2 small satellites

PSLV-C52, satellites, earth observation, INSPIREsat-1, INS-2TD, Radar Imaging Satellite, agriculture, forestry, plantations, soil moisture, hydrology, flood mapping, Indian space agency, Indian Institute of Space Science & Technology (IIST), ISRO, Indian Space Research Organisation (ISRO), PSLV-C52, Sriharikota, Andhra Pradesh

Isro's Polar Satellite Launch Vehicle PSLV-C52 blasted off from the First Launch Pad of Satish Dhawan Space Centre, Sriharikota at the scheduled time of 5:59am on Monday morning. The launch vehicle carrying earth observation satellite EOS-04 along with two co-passenger payloads – INSPIREsat-1 and INS-2TD – lifted off from the spaceport at the end of a 25-hour countdown, marking the Indian space agency's first mission launch in 2022.

పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted: 02/14/2022 11:13 AM IST
Isro s pslv c52 successfully launches earth observation and 2 small satellites

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నేతృత్వంలో ఇవాళ తెల్లవారుజామున ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈఓఎస్‌–04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59లకు నెల్లూరు జిల్లాలో గల శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్లోని ఫస్ట్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి ఈ ప్రయోగించిన ఈ పీఎస్ఎల్వీ-సీ52 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ సరిగ్గా 17 నిమిషాల 34 సెకన్ల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాలను నిర్ణత క్క్ష్యలోకి చేర్చింది.

2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. ఈ ఉపగ్రహాల్లో భూ పరిశీలన శాటిలైట్ ఈఓఎస్-04 కూడా ఉంది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తున సోలార్ సింక్రోనస్ ఆర్బిట్ లో సజావుగా ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్ బరువు 1,710 కేజీలు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ భూమిని అత్యంత స్పష్టతతో చిత్రీకరించగలదు. ఇది ప్రధానంగా వ్యవసాయం, అటవీశాఖ, ఉద్యానవనాలు, భూమిలో తేమ, జలవనరులు, వరదలు వంటి అంశాల్లో విశేషంగా తోడ్పాటు అందిస్తుంది.

కాగా, మిగిలిన రెండు ఉపగ్రహాలు చిన్నవి. వీటిలో ఒకటి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన విద్యార్థులు రూపోందించినది. దీనీని రూపకల్పనకు వీరు బౌల్డర్ కు చెందని యూనివర్సిటీ ఆఫ్ కలరాడో లో గల ల్యాబరెటరీ ఆఫ్ అట్మాస్పియర్ అండ్ స్పేస్ ఫిజిక్స్ వారి సహకారాన్ని కూడా తీసుకున్నారు.  స్టూడెంట్ శాటిలైట్ కాగా, మరొకటి టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్. ఈ డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్ ను గతంలో ప్రయోగించిన ఇండియా-భూటాన్ సంయుక్త ఉపగ్రహం ఐఎన్ఎస్-2బీకి కొనసాగింపుగా ప్రయోగించారు. పీఎస్ఎల్వీ సి-52 విజయంతో ఇస్రోలో సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles