AirAsia flight diverted after snake spotted inside plane విమానంలో విషధరము.. టెన్షన్ లో ప్రయాణికులు..

Passengers spotted a snake inside an airasia flight then

snake on plane, snake in AirAsia flight, Air Asia, Kuala Lampur, snake on airasia flight, snake on plane videos, AirAsia, snake on plane, Kuala Lumpur, Tawau in Malaysia, overhead baggage, Pilot Hana Mohsin Khan, AirAsia flight, Twitter, viral video

An AirAsia flight from Kuala Lumpur to Tawau in Malaysia was diverted after a snake was spotted inside the airplane. Pilot Hana Mohsin Khan shared a video of the reptile slithering near the overhead baggage area of the aircraft on Twitter, where it has racked up thousands of views.

ITEMVIDEOS: విమానంలో విషధరము.. టెన్షన్ లో ప్రయాణికులు.. ఆ తరువాత..

Posted: 02/14/2022 12:11 PM IST
Passengers spotted a snake inside an airasia flight then

విమానయానం. అందులోనూ ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్తోంది. ఇకనేం అందులోని ప్రయాణికులు అందరూ హాయిగా సేదతీరుతారు. విమానం ఆకాశంలో దూసుకెళ్తోంది.. కొందరు సేద తీరుతుండగా, కొందరు శ్రావ్యానందం పొందుతుండగా, కొందరు పుస్తకపఠనం చేస్తున్నారు. మరికొందరు నిద్రకు ఉపక్రమించారు. అయితే ఇలా వెళ్తున్న విమానం ఒక్కసారిగా తన దారి మళ్లించింది. తమకు రూటులో లేని విమానాశ్రయంలో నిలిపివేసింది. వెంటనే ప్రయాణికులందరినీ కిందకు దిగాల్సిందిగా కోరింది. అంతే ఉరుకులు పరగుల మధ్య ప్రయాణికులందరూ కిందకు దిగారు.

వెంటనే సంబంధిత విమానాశ్రయంలోని అట్ ఎన్ని రిస్క్ సిబ్బంది విమానంలోకి ప్రవేశించి తమకు కావాల్సినది తీసుకున్నారు. అంతే దీంతో మళ్లీ ప్రయాణికులందరూ విమానంలోకి ప్రవేశించిగానే విమానం బయలుదేరి వెళ్లింది. ఏంటీ ఇదేమైనా హైజాకా.? అన్న సందేహాలు వస్తున్నాయా.? కాదండీ విమానంలోకి ప్రవేశించిన అనుకోని అతిధిని ఎయిర్ ఫోర్టులోని ఎట్ ఎనీ రిస్క్ సిబ్బందీ తీసుకుని వెళ్లారు. ఎవరా అతిధి అంటారా.? విషమును ధరించిన త్రాచు పాము. అదేనండీ విషధరము. విమానం టేకాఫ్ అయి అకాశంలో విహరిస్తున్న తరువాత ప్రయాణికుల తలపై ఉంటే లగ్యేటీ రాక్ వద్ద కనిపించింది. దీంతో ప్రయాణికులు టెన్షన్ కు గురయ్యారు.

వెంట‌నే విమానం నడిపిస్తున్న మహిళా పైల‌ట్‌ హనా మోసిన్ ఖాన్ కు స‌మాచారం అందించారు. పాము వ‌ల్ల ఎవ‌రికీ హానీ క‌లిగించొద్ద‌నే ఉద్దేశంతో ఆ విమానాన్ని పైలట్ దారి మ‌ళ్లించాడు. అయితే ఎయిర్ ఏషియా విమానం కౌల‌లంపూర్ నుంచి మ‌లేషియాలోని త‌వుకు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విమానాన్ని కుచింగ్ ఎయిర్‌పోర్టుకు మ‌ళ్లించి.. పామును విమానం నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు. అయితే విమానంలోకి పాము ఎలా ప్ర‌వేశించింద‌నే అంశంపై అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ల‌గేజ్ బ్యాగులో నుంచి పాము వ‌చ్చిందా? లేక విమానం ల్యాండైన స‌మ‌యంలో నేరుగా పాము ప్ర‌వేశించిందా? అనే విష‌యం తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles