Mahindra interested in funding the EV cycle ఆనంద్ మహీంద్రా మనసు దోచిన ఈవీ సైకిల్ కిట్..!

This disruptive device can turn your cycle into ev in 20 mins anand mahindra wants to invest

anand mahindra ev revolution, mahindra ev, anand mahindra ev, anand mahindra electric cycle, Gursaurabh Singh, Gursaurabh Singh cycle, Gursaurabh Singh e-cycle, e-cycle, Dhruv Vidyut Electric Conversion Kit

Industrialist Anand Mahindra, who is known for sharing interesting and witty posts on social media, took to Twitter on Saturday to show his followers a video about the innovation of the motorised cycle. Imagine a cycle that can be turned into an electric vehicle with the help of one device. Imagine the opportunities it can create for many in a country like ours where mobility and transport continue to be a challenge in many quarters.

ITEMVIDEOS: ఆనంద్ మహీంద్రా మనసు దోచిన ఈవీ సైకిల్ కిట్..!

Posted: 02/12/2022 08:08 PM IST
This disruptive device can turn your cycle into ev in 20 mins anand mahindra wants to invest

సోషల్ మీడియాలో ఆసక్తికరమైన, అద్భుతమైన విషయాలను పంచుకోవడంలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడు ముందుంటారు. పంచుకోవడమే కాదు అవసరం అయితే సహకరం కూడా అందిస్తుంటాడు ఆయన. ఇటీవల ఐఐటీ చెన్నైకి చెందిన విద్యార్థుల సృజనాత్మకతకు ముగ్దుడైన ఆయన వారి 3డి ప్రింటింగ్ ఇళ్లు నిర్మాణం సంస్థలో తనను చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఇలా టాలెంట్ ఉన్నవారిని నిత్యం ప్రోత్సహించడం ఆయనకు సొంతం. తనకు నచ్చితే ప్రోత్సహించి వెన్నుతట్టడం ఆయనలోని మంచితత్వం.  

తాజాగా అలాంటి టాలెంట్ తో ఓ వ్యక్తి రూపోందించిన డివైజ్ మహీంద్రా మనస్సును దోచింది. అంతే ఆయనకు అండగా నిలిచారు ఆనంద్ మహింద్రా... ఇప్పుడు మార్కెట్ లోకి ఎలక్ట్రిక్‌ వాహనాల ఇన్నోవేషన్స్‌ రోజుకోటి వస్తోంది కానీ సైకిల్ కి ఉన్న ఆదరణ ఇంకా తగ్గలేదు. ఇప్పటికి దేశంలో 53 శాతం మంది ప్రజలు సైకిల్ ని తమ వాహనంగా వాడుతున్నారు. అయితే వాడుతున్న సైకిల్‌కి పెద్దగా ఆల్ట్రేషన్‌ చేయకుండానే ఈవీ వెహికల్‌గా మార్చే అద్భుతమైన డివైజ్‌ని గురు సౌరభ్‌ తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారడంతో ఆనంద్ మహింద్రా దృష్టిని ఆకర్షించింది.

అందుకే ఆనంద్‌ మహీంద్రా అతనికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు. గురు సౌరభ్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేస్తానంటూ తనంతట తానుగా ప్రకటించాడు. గురు సౌరభ్‌ రూపొందించిన డివైజ్‌తో వీడియో చేసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సింపుల్‌ డివైజ్‌తో సైకిల్‌ ఈవీ వెహికల్‌గా మారిపోతుంది. 170 కేజీ బరువు మోసుకెళ్లగలుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఫైర్‌ , వాటర్‌, మడ్‌ ప్రూఫ్‌ కూడా. 20 నిమిషాల పాటు పెడల్స్‌ తొక్కితే దీని బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్‌ అవుతుంది. ఇలా ప్రతీ అంశం వివరించడం కంటే మీరే ఆ వీడియో చూడండి.. తప్పకుండా మీకు నచ్చుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles