Mother hangs child from 10th floor to pick her cloth బట్టల కోసం పిల్లాడి ప్రాణం పనంగా పెట్టిన తల్లి.!

Viral video elephant and jcb machine engage in an intense fight

trending news india, Mother hangs child from 10th floor, Faridabad's Florida society, Sector 82, Faridabad, Delhi NCR's Faridabad, high-rise society, Mother, son, highrise appartments, florida society, faridabad, Delhi NCR, Viral Video, jaw dropping video, google trends, trending video, chilling video, omg video, video viral

A jaw-dropping video is being widely shared online where a child is seen dangling from the 10th floor of a high-rise society in Delhi NCR's Faridabad area. The video was captured on camera by a resident living in the opposite society.

ITEMVIDEOS: నిండా నిర్లక్ష్యం: బట్టల కోసం పిల్లాడి ప్రాణం పనంగా పెట్టిన తల్లి.!

Posted: 02/12/2022 12:21 PM IST
Viral video elephant and jcb machine engage in an intense fight

తల్లిదండ్రులు పిల్లలకు ఏమాత్రం కష్టం కలగకుండా పెంచుతుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే సంపన్నులు మరింత సుకుమారంగా తమ బిడ్డల పరిరక్షణను చూసుకుంటారు. తమ బిడ్డలపై వారికి ఎంత ప్రేమ ఉన్నా ఒక్కోసారి వారి చేసే పనులను పరిశీలిస్తే మాత్రం.. ఇంత చిన్నవాటికి వీరు బిడ్డల ప్రాణాలను పణ్ణంగా పెడతారా.? అన్న అనుమానాలు కూడా కలగక మానవు. అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్ల కోడుతోంది. దీంతో ఆ ఇంటి కుటుంబసభ్యులు చేసిన పనికి ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని సెక్టార్ 82లోగల ఫరియాబాద్ ఫ్లోరిడా సోసైటీకి చెందిన ఓ విలాసవంతమైన అపార్టుమెంటులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహుళ అంతస్థుల అపార్టుమెంటులోని పదో ఫ్లోర్ లో ఉంటోన్న కుటుంబానికి సంబంధించిన వస్త్రాలు కింద ఫ్లాట్‌లో పడిపోయాయి. కింద ఇంటివారు తాళం వేసుకుని బయటకు వెళ్లారు. దీంతో ఆ బట్టలను తెచ్చుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఆ ఇంటి కుటుంబసభ్యులు చేసిన నిర్వాకమిది. ఏకంగా తమ బిడ్డ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి, బాల్కనీ నుంచి బెడ్‌షీట్‌ సాయంతో కింద ఫ్లోర్‌కు చిన్నారిని దింపి మళ్లీ పైకి లాగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆ త‌ల్లిపై నెటిజ‌న్లు విమర్శలు జ‌ల్లు కురిపిస్తున్నారు. తొమ్మిదో ఫ్లోర్ నుంచి బాల్క‌నీ ద్వారా ఆ త‌ల్లి త‌న బిడ్డ‌ను బెడ్‌షీట్ సాయంతో దించడంతో, ఆ చిన్నారి వస్త్రాలు తీసుకుని వచ్చి ఆ బెడ్‌షీట్‌నే పట్టుకుని మ‌ళ్లీ పైకి వ‌చ్చాడు. ఈ దృశ్యాల‌ను ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారంపై మీడియా ఆ త‌ల్లిని ప్రశ్నించింది. దీంతో ఇలా చేసినందుకు క్షమించాల‌ని ఆమె కోరింది. త‌న చ‌ర్య‌ను వీడియో తీస్తున్నారని త‌నకు తెలియదని చెప్పుకొచ్చింది.

తొమ్మిదో ఫ్లోన్‌లోని బాల్కనీలో ఆరేసిన చీర కింద ఫ్లోర్లో పడిపోవడం, ఆ కింది ఫ్లోర్‌లోని ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమె త‌న బిడ్డ‌ను దింపిన‌ట్లు తెలిసింది. అయితే, ఆ బిడ్డ క్షేమంగా ఈ ప‌ని పూర్తి చేయ‌డంతో స‌రిపోయింది కానీ, ఒక్క‌సారిగా ప‌ట్టు త‌ప్పితే తొమ్మిదో ఫ్లోర్ నుంచి కింద‌ప‌డి ప్రాణాపాయం సంభ‌వించేద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వ‌స్త్రాల కోసం బిడ్డ ప్రాణాలు ఫణంగా పెట్టి ఇంత తెలివి త‌క్కువ‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles