ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని, నిరుద్యోగులను విస్మరించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలణకు ప్రణాళిక ఏమైనా ఉందా అని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా.. అని నిలదీశారు. నిరాశ నిస్పృహలతో యువత ఆందోళనలో ఉన్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకు అన్ని వర్గాలతో పాటు నిరుద్యోగులను కూడా వైసీపీ పార్టీ మోసం చేసిందని దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చాక కొత్త సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చేస్తామని.. ఏటా ఆరు వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తానంటూ జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు చూస్తే మెగా డీఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదని విమర్శించారు. గ్రూప్ - 1, గ్రూప్ - 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా రావడం లేదని ఆక్షేపించారు. తమకు ఉద్యోగాలు ఏవంటూ కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి యువత అడిగితే.. లాఠీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేస్తుండడం సరికాదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులున్నారని.. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రభుత్వం దగ్గర ఉందా? లేదా? అని నిలదీశారు. నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారని ప్రశ్నించారు. వాటిలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? అమలు ఎంత వరకూ వచ్చిందో యువతకు వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. మెగా డీఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారని.. ఆరు వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియజేయాలన్నారు.
బీఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నవాళ్లు. వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళన అనేది ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా..? అర్థమైనా అర్థం కానట్లు ఉందా అనే సందేహం కలుగుతోందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమ వాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదనే విషయాన్ని పాలకులు గుర్తించాలని పవన్ హితవు పలికారు.
(And get your daily news straight to your inbox)
Jun 24 | తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ వారికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షానే... Read more
Jun 24 | కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటలోని వాయనాడ్ ఎంపీ రాహుల్... Read more
Jun 24 | బావ, బావ పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు.. అన్నది పాతకాలం నాటి నానుడి. ఆ తరువాత బావలకు సముచిత గౌరవం కలిగేంచే రోజులు వచ్చాయి. అయితే భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్లు.. మళ్లీ బావలను... Read more
Jun 24 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు... Read more
Jun 24 | అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. కేవలం రోజుల వ్యవధిలోనే అగ్రరాజ్యంలో ఏకంగా 35 మంది ప్రాణాలను ఎందుకు తాము టార్గెట్ గా మారామో కూడా తెలియకుండానే బలైపోయాయి. అందుకు కారణం తుపాకీ తూటాలు.... Read more