అసోంలోని ప్రజలపై గజరాజుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అడవులు రానురాను కుంచించుకు పోతున్నాయన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. అడవులు అన్యాక్రాంతం కావడంతోనే క్రూరమృగాలు మనుషుల అవాసాల మధ్యకు చోరబడి వారి ప్రాణాలను తీస్తున్నాయని.. దీంతో అటు మనుషులకు- మృగాలకు మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతోందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగిప్పుడు మాత్రమే కాకుండా అటవీశాఖ అధికారులు ముందునుంచే చర్యలు తీసుకుని మనుషులకు-మృగాలకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తొలగించాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.
ఇక అదేవిధంగా విద్యుత్ షాక్, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విషాహారం తినడం, గోతుల్లో పడిపోవడం, పిడుగుపాట్లకు గురికావడం లాంటి కారణాలతో ఏనుగులు కూడా భారీ సంఖ్యలో మరణిస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఫండ్ అనే సంస్థ నిర్వహించిన నేచుర్ బ్లాగ్ ప్రకారం 2010 నుంచి 2019 వరకు 761 మంది ప్రజలు, అలాగే 249 గజరాజులు ఒక్క అస్సోం జిల్లాలోనే మరణించాయి. అయితే, తరచూ ఏనుగుల దాడులు జరుగుతుండటంతో అటవీ ప్రాంతాల సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ధుబ్రి జిల్లా తమర్హట్ ఏరియాలోని ఓ గ్రామంలో వ్యక్తిపై ఏనుగు దాడిచేసింది.
తమర్హట్ ఏరియాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు తమ టీ తోటల్లో పనులు చేసుకుంటుండగా సమీప అడవి నుంచి దారి తప్పిన ఏనుగు ఒక్కటి అటువైపు వచ్చింది. మంద నుంచి విడిపోయిన ఏనుగు దారితప్పి.. వెతుకుతూ అటుగా వచ్చింది. దానిని చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. అది గమినంచిన ఏనుగు వారిని వెంబడించింది. ఈ క్రమంలో కనకరాయ్ అనే వ్యక్తి కాలుజారి పడిపోయాడు. దాంతో అతనివద్దకు చేరుకున్న ఏనుగు కనకరాయ్పై దాడిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కనకరాయ్ ప్రస్తుతం ఆస్పత్రిలోమృత్యువుతో పోరాడుతున్నాడు. ఇటీవల మేఘాలయలోని ఇదే తరహాలో ఘటన జరిగింది. వెస్ట్ గారో హిల్స్ ప్రాంతంలోనూ ఇద్దరిని చంపి.. ఒకరిని తీవ్రంగా గాయపర్చింది.
#WATCH | A 30-year-old man was chased and attacked by a wild elephant at a village in Tamarhat area of Dhubri district of Assam on December 18
— ANI (@ANI) December 20, 2021
"The man was admitted to a hospital for treatment and the elephant was chased towards jungle area," a forest officer said pic.twitter.com/YsRvZAUe1h
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more