సినిమా పరిశ్రమ విషయంలో మంచి పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఆ పాలసీ ద్వారా పెద్ద, చిన్న సినిమాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గత కొద్దికాలంగా కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే.. అందరి అభ్యర్థనలనూ పరిగణలోకి తీసుకుని ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ తరచూ సమావేశమై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తనతో పంచుకున్నట్లు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు.. ప్రభుత్వ ఆలోచనలను సీఎం వైఎస్ జగన్ వారికి వివరించారు.
భారీ బడ్జెట్ సినిమాలకు వారంపాటు ప్రత్యేక ధరలు..
‘‘సినీ పరిశ్రమలో ఉన్న కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడేందుకు ఓ మంచి వ్యవస్థను క్రియేట్ చేసే ఉద్దేశంతో అడుగులు వేశాం. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేకుంటే ఎక్కువ, తక్కువ వసూళ్లు జరుగుతాయి. నేను, చిరంజీవి కలిసి కూర్చొని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా.. అంతిమంగా ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ అదరించేలా టికెట్ ధరలు వుండాలని నిర్ణయించాలని భావిస్తున్నాం’’ అని అన్నారు.
‘‘ హీరో, హీరోయిన్, దర్శకుడు పారితోషికం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే.. నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలి. అలా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. అలాంటి సినిమాలకు వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని అనుకున్నాం." అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
విశాఖకు వస్తే.. అన్నివిధాల ప్రభుత్వ సహకారం..
సినీ పరిశ్రమ నెమ్మదిగా విశాఖపట్నం రావాలని, అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తే.. వాళ్లకూ విశాఖలో స్థలాలు ఇస్తామని అన్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో విశాఖపట్నం పోటీపడగలదని, ఇంకో పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలని సూచించారు. తెలంగాణ కన్నా.. ఏపీ నుంచే సినీ పరిశ్రమకు ఆదాయం ఎక్కువ వస్తోందన్నారు. ఏపీలో జనాభా, ప్రేక్షకులు, థియేటర్లు ఎక్కువన్న ముఖ్యమంత్రి.. 20 శాతం షూటింగ్‌లు రాష్ట్రంలో చిత్రీకరిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more