Monitor Lizard In Restaurant Traps Woman On Chair రెస్టారెంట్లోకి ఉడుము.. భయంతో చిన్నపిల్లలా ఏడ్చేసిన మహిళ.!

Watch woman climbs chair ends up in tears after spotting monitor lizard in restaurant

monitor lizard, monitor lizard in restaurant, monitor lizard in Thailand restaurant, Funny video in restaurant, funny video in Thailand restaurant, Lizard In Restaurant, Lizard found in Restaurant, Lizard enters Restaurant, Lizard video, Lizard viral video, viral video, Funny video, Thailand, video viral

The sight of a monitor lizard in a restaurant sent a woman into hysterics. Footage from a restaurant in Thailand that has emerged online shows the unnamed woman standing on her chair and screaming after spotting the reptile on the ground. Another person - possibly an employee of the restaurant - scrambled to capture the monitor lizard as the woman continued to scream loudly.

ITEMVIDEOS: రెస్టారెంట్లోకి వచ్చిన ఉడుము.. భయంతో చిన్నపిల్లలా ఏడ్చేసిన మహిళ.!

Posted: 02/10/2022 08:50 PM IST
Watch woman climbs chair ends up in tears after spotting monitor lizard in restaurant

మనుషులకు భయాలు ఉండడం సహజం. కొందరు చిన్నచిన్న విషయాలకు కూడా జంకుతుంటారు. కొందరికి ఎత్తైన ప్రాంతాలంటే భయం, మరికొందరికి పాములు, కుక్కలు, బొద్దింకలు అంటే భయం. భయపడే ప్రాణాలు కళ్ల ముందు కనబడితే వాటి నుంచి ఆమడ దూరం పారిపోతుంటారు. ఇలాంటి ఎన్నో ఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఓ మహిళ ‌ఉడుమును (మానిటర్‌ లిజర్డ్) విపరీతంగా భయడింది. ఈ ఘటన  థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నారాతివాత్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో మహిళ కూర్చీలో కూర్చొని ఉండగా బయట నుంచి అక్కడికి ఓ ఉడుము వచ్చి చేరుతుంది. తోకను ఊపుతూ, నాలుకను బయటకు చూపుతూ భయపెట్టింది. దీంతో మహిళ కెవ్వుమని కేకలు వేస్తూ కూర్చీ మీద నిల్చుంటుంది. అంతేగాక చిన్నపిల్లలా గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇంతో షాప్‌లోని ఓ యువకుడు ఆ ఉడుమును పట్టుకునేందుకు పయత్నించినప్పటికీ వీలుపడలేదు. అయినా అది లొంగకుండా  అతనిపై ఎదరుదాడికి ప్రయత్నించింది.

మహిళను ఏడుపుని చూడలేక ఇంతలో ఆ యువకుడు ఓ పొడవైన కర్రను తెచ్చి ఉడుము తల మీద బలంగా నొక్కి పెట్టాడు. అలా దానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే ఏడుస్తున్న మహిళ కళ్లు తుడుచుకుంటూ కూర్చీ దిగి నవ్వేసింది. దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్‌లో ఫిబ్రవరి 9న పోస్టు చేశారు. 56 సెకన్ల నిడివితో కూడిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ ప్రవర్తనపై నవ్వులు చిందిస్తున్నారు. ఉడుమును చూడగానే అమె వ్యవహరించిన ప్రవర్తన అమెనే నవ్వించేలా చేసింది.

అంతకుముందే రెస్టారెంట్లోకి వచ్చి నిల్చున్న ఇద్దరు మహిళలు దూరం నుంచి ఈ తతంగాన్ని మొత్తం చూశారు. ఉడుమును పట్టుకున్న తరువాత బాధిత మహిళ వారిని చూసి వాళ్లు నన్ను చూసి నవ్వేస్తున్నారు.. అంటూ నవ్వును అపుకోలేకపోయింది. ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో భలే సండది చేస్తు నెటిజనులను కూడా నవ్విస్తోంది. ఇక మరికొందరు నెటిజనులు మాత్రం ‘ఉడుమును చూసి మహిళ బయపడటం కాదు.. పాపం ఉడుమే మహిళను చూసి భయపడి ఉంటుంది.’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles