No amount of alcohol is good for the heart, new report కరోనాను మించిన స్థాయిలో మద్యం మరణాలు.. అధ్యయనాలు

No amount of alcohol is good for the heart new report says but critics disagree on science

health, alcohol harms heart, Heart Problems, Cancer, heart health, World Health Federation, American Heart Association, Alcohol Consumption, cardiovascular problems, coronary disease, heart failure, high blood pressure, stroke, aortic aneurysm, critics disagree, science

World Heart Federation released a policy brief saying that no amount of alcohol is good for the heart. We decided that it was imperative that we speak up about alcohol and the damages to health, as well as the social and economic harms, because there is an impression in the population in general, and even among health care professionals, that it is good for the heart," said Beatriz Champagne, chair of the advocacy committee that produced the report.

మందుబాబులకు షాక్.. అరోగ్యంపై మద్యం దుష్ప్రభావాలు అనేకం: అధ్యయనం

Posted: 02/11/2022 11:39 AM IST
No amount of alcohol is good for the heart new report says but critics disagree on science

మద్యం తీసుకోవడం శీతల ప్రాంతాలు, పాశ్చాత్య దేశాల జీవనశైలిలో భాగం. అయితే దీనికి అలవాటు పడినవారు మన దేశంలోనూ ఉన్నారు. తరం మారిన కొద్దీ మద్యం తాగితే తప్పులేదన్న భావన కలుగుతోంది. మనదేశంలో మితంగా తాగే హైక్లాస్ మనుషుల కన్నా మితిమీరి తాగే మాస్ మనుషులే అధికం. అన్నపానీయాలు లేకపోయినా పర్వాలేదు కానీ.. మద్యానికి డబ్బు లేకపోతే హైరానా పడిపోయే జీవాలు ఎన్నో. అలి మెడలోని తాళి తాకట్టు పెట్టైనా సరే.. కన్న బిడ్డల జీవితాలు కాలరాసిపోతున్నా.. తమకు మధ్యం ఉంటే చాలు అనేవారి సంఖ్య తక్కువేం కాదు.

అయతే వీరిని చూసిన వారు ‘మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది’ కానీ ఇలా ఒళ్లుపై తెలియకుండా తాగడం ఏంటీ అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి మద్యం మితంగా తాగితే అరోగ్యానికి మేలు చేస్తుందా.? అన్న ప్రశ్నకు కొందరు.. ఈ మేరకు వైద్యలే చెప్పారంటూ కూడా బుకాయిస్తుంటారు. అయితే ప్రచారంలో ఉన్న ఈ అపోహలో నిజమెంత.? అన్న విషయంలోకి ఎంట్రీ ఇస్తే.. మద్యం తాగడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, అరోగ్యంపై అవి చూపే పెనుప్రభావాల గురించి తెలుసుకుంటే దాని జోలికి వెళ్లాలంటేనే భయపడతారు. మద్యం తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మందికి పైనే ప్రాణాలు విడుస్తున్నారు.

గుండె జబ్బులు, జీర్ణాశయ వ్యాధులు, జీర్ణకోశం ఇలా ఎన్నో ప్రభావితమవుతున్నాయి. మితం, అపరిమితం అన్న తేడా లేకుండా ఎంత తీసుకున్నా మద్యం అరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గుండె జబ్బుల రిస్క్ ను స్వయంగా కొని తెచ్చుకున్నట్టేనని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే అంటోంది. మద్యంతో గుండె ప్రమాదంలో పడుతుందని చెబుతోంది. మద్యానికి దూరంగా ఉండాలని సిఫారసు చేస్తోంది. మద్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.

మద్యం తీసుకోవడం వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నట్టు ఆక్స్ ఫర్డ్ అధ్యయనం తేల్చింది. ఇందులో సుమారు 4 లక్షల మరణాలు కేన్సర్ కారణంగా ఉంటున్నాయని తెలిపింది. నోటి క్యాన్సర్, గొంతు, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మద్యానికి ధూమపానం తోడయితే, ఇతర ఆరోగ్య సమస్యలు, స్థూల కాయం వంటి వాటితో బాధపడుతున్న వారికి రిస్క్ మరింత పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కనుక దీర్ఘాయుష్షు కోసం మద్యాన్ని దూరం పెట్టడమే ఉత్తమం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles