Janasena Chief Pawan Kalyan Fires On Ys Jagan వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కల్యాణ్

Janasena chief pawan kalyan lamblasts on ys jagan over his govt failures

Pawan Kalyan, JanaSena, JSP, Pawan Kalyan Speech, JanaSenani, Pawan Kalyan Meeting, Pawan Kalyan Janasena party news, jana party daily updats, jana sena pawan kalyan, pawan kalyan janasena, janasena leaders interviews, janasena vs ycp, janasena chief, janasena office, janasena press meet, janasena activists, janasena latest news, Govt Employees, Govt Teachers, YSRCP Govt Failures, Protests, PRC issue, Andhra Pradesh, Politics

Janasena president Pawan Kalyan gave a strong counter to the YSRCP government. He spoke in an interview with party social media. The janasenani said "Do what needs to be done to employees fairly. They come to the roads ..? The ministers are provoking them .. ‘said Pawan Kalyan. If today teachers are attending to duties wearing black badges .. it is a failure of the government. Stupidities stop .. The counter said to work."

ITEMVIDEOS: ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థి పార్టీలను నిందించడం సబబు కాదు: పవన్ కల్యాణ్

Posted: 02/10/2022 12:29 PM IST
Janasena chief pawan kalyan lamblasts on ys jagan over his govt failures

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగం అంటూనే.. వారిని అందోళన బాట పట్టించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యాలతో కూడిన వేతన సవరణలు చేయడంతో ఉద్యోగులు అందోళన బాట పట్టాల్సివచ్చిందని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలోని ఉపాద్యాయులు ఇంకా తమ డిమాండ్లు పరిష్కారించాలని నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతూనే ఉన్నారని, వాటిని పరిష్కరించడం మాని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడం వైసీపీ పార్టీ ఎత్తుగడలో భాగమేనని అన్నారు.

అధికారంలో వున్నాం కదా అని.. ప్రతిపక్ష పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. ప్రజలకు సుపరిపాలన అందించేపనిలో వారుండాలని సూచించారు. ఉద్యోగుల సమస్య తాము సృష్టించింది కాదని, ఇతర విపక్షాలు సృష్టించిందీ కాదని.. జనసేన సోషల్ మీడియా టీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ స్పష్టంచేశారు. పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, జీతాలు పెంచుతామని ఉద్యోగులకు చాలా ఆశలు కల్పించారని ఆరోపించారు. ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని, వేతన సవరణను అమలు చేయమని అడుగుతున్నారని తెలిపారు.

ఉద్యోగులకు కడుపుమండి లక్షలాది మంది రోడ్లపైకి వస్తే, దానికి జనసేనను, ఇతర పార్టీలను నిందించడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఏంచేసినా సరే డూడూ బసవన్నలా తలూపుతూ వెళ్లాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ మంత్రివర్గంలో ప్రతి ఒక్కరూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, మీరు ఇచ్చిన హామీలు తప్పినందువల్లే ఉద్యోగులు ఆందోళనలు తెలుపుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. అంతేతప్ప వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు తమను దూషించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, వైసీపీ నేతలు వెటకారాలు ఆపి పని చూడాలని హితవు పలికారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles