Viral video: Woman attacks RTC driver ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై వీరంగం సృష్టించిన మహిళ

Woman attacks rtc driver in vijayawada video goes viral

woman attacked RTC bus driver, woman abused RTC bus driver, woman kicks RTC bus driver, woman alleges bus dashed her vehicle, Nandini, RTC Bus, Driver Musalaiah, wrong direction, Scooty, Andhra Hospital, Krishna Lanka, Vijayawada, Andhra Pradesh, Crime

In a shocking incident, a woman attacked and abused an RTC bus driver after alleging that the bus dashed her vehicle which is coming in opposite direction. The incident took place near Andhra Hospital on route no five in Vijayawada. The woman identified as Nandini, a 28-year-old resident of Taraka Rama Nagar, Krishna Lanka. She stopped the RTC bus and attacked the driver by dragging him by his shirt and abusing him.

ITEMVIDEOS: ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వెళ్లిన మహిళ.. డ్రైవర్ పై దాడి..

Posted: 02/10/2022 11:39 AM IST
Woman attacks rtc driver in vijayawada video goes viral

రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్న అర్టీసీ అందరికీ సుపరిచితమే. ఇక ఈ సంస్థలో విధులు నిర్వహించే కార్మికులకు కొన్నాళ్ల కిందటే ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా గుర్తింపును కల్పించిందీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఉద్యోగులు అందులోనూ విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఎవరైనా అడ్డగించినా.. అటంకం కల్పించినా అది నేరమే. అయితే ఓ మహిళ మాత్రం ఆటకం కల్పించడమే కాదు.. ఏకంగా తన స్కూటీని బస్సుకు అడ్డంగా పెట్టి.. బస్సు ఎక్కి డ్రైవర్ పై దాడికి పాల్పడింది. చోక్కా పట్టుకుని బస్సు దిగు అంటూ నానారభస చేసింది. అంతటితోనూ శాంతించని ఆమె ఏకంగా గేర్ బాక్సు పైకి ఎక్కి డ్రైవర్ ను కాలితోనూ తన్నింది.

రోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు వచ్చి మహిళను దిగాల్సిందిగా కోరినా.. అమె దిగలేదు సరికదా.. వారి ముందే దాడి చేస్తూ హంగామా సృష్టించింది. ఓ వైపు బస్సులోని మహిళా కండక్టర్, బస్సులోని ప్రయాణికులు దిగవమ్మా అని చెబుతున్నా పట్టించుకోని అమెను.. మహిళా కండక్టర్ బలవంతంగా కిందకు దించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం ప్రకారం.. క్రితంరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ విద్యాధరపురం డిపోకు చెందిన బస్సు ప్రకాశం రోడ్డులో వెళ్తోంది.

అదే సమయంలో ఆంధ్రా ఆసుపత్రి సమీపంలో కృష్ణలంక తారకరామానగర్‌కు చెందిన నందిని అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డం వచ్చింది. డ్రైవర్ ముసలయ్య సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు ఆమె ద్విచక్ర వాహనం సమీపంలోకి వచ్చి ఆగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ వెంటనే బస్సెక్కి డ్రైవర్‌పై దాడిచేసింది. చొక్కా పట్టుకుని లాగి చింపేసింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. కాలితో తన్నింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన మహిళపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles