Man trapped in a cliff over 40 hours, army rescues ఆర్మీ సాయంతో కుహారం నుంచి బయటపడ్డ ట్రెక్కర్

Man trapped in a cliff over 40 hours without food water army rushes to rescue

Malapuzha man trapped, Man trapped at hill, Man trapped at rock, Palakkad man trapped, Man stuck at hill, Real life 127 Hours, Man trapped on Hill, Kerala Trekker trapped, Kerala Trekker, Trapped, rescue ops, kerala trekker, trekker r babu, indian army, ndrf, kerala rescue operation, Cherad Hill, Malampuzha, Palakkad, Kerala

In a shocking incident, a man has been trapped on a hill cleft for over 40 years without food and water. The incident took place in Palakkad district, Kerala. According to the reports, the man identified as R Babu, a resident of Malampuzha. It is learnt that he along with two others decided to climb Cherad Hill and his two friends stopped their trekking halfway.

కొండ కుహారంలో చిక్కుకున్న ట్రెక్కర్.. బయటకు తెచ్చిన ఇండియన్ ఆర్మీ

Posted: 02/09/2022 03:54 PM IST
Man trapped in a cliff over 40 hours without food water army rushes to rescue

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని మలంపుజా సమీపంలోని మారుమూల కొండ చీలికలో చిక్కుకున్న 23 ఏళ్ల యువకుడిని ఆర్మీ బృందం ఇవాళ ఉదయం రక్షించి బయటకు తీసుకువచ్చింది. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాతి కొండను ట్రెక్కింగ్ చేస్తుండగా, జారి పడుతూ కొండ కుహారంలో చిక్కుకుపోయిన యువ ట్రెక్కర్ గత రెండు రోజుల తర్వాత ఇవాళ ఇండియన్ ఆర్మీ సాయంతో బయటపడ్డాడు. కోస్ట్‌ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్‌లో యువకుడిని అక్కడి నుంచి తరలించారు. సైన్యానికి చెందిన వైద్య బృందం అతనికి ప్రథమ చికిత్స అందించి.. ఎయిర్ లిఫ్ట్ చేసింది.

పర్వతరోహకుడు ఆర్ బాబు ఆరోగ్యం బాగానే ఉందని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. అతన్ని కంజికోడ్‌లోని బీఈఎంఎల్‌ మైదానానికి విమానంలో తరలించి పాలక్కాడ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కొండపైకి తిరిగి, రెండు రోజుల కష్టాలు అనుభవించినప్పటికీ బాబు అంతా ఉల్లాసంగా కనిపించారు. మనోరమ న్యూస్ ప్రసారం చేసిన విజువల్స్ రెస్క్యూ టీమ్‌తో కలిసి నవ్వుతున్న బాబును చూపించాయి. అతను కృతజ్ఞతా చిహ్నంగా సైనికులను ముద్దుపెట్టుకోవడం కూడా కనిపించింది. ఆర్మీ సిబ్బందితో కలిసి బాబు భారత సైన్యాన్ని కొనియాడారు. రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ బలగాలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కృతజ్ఞతలు తెలిపారు.

బాబు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం కొండలపైకి వెళ్లారు. దిగువకు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు, అలసిపోయిన బాబు కాలుజారి కింద పడిపోయాడు. కిందపడే సమయంలో బాబు కాలికి గాయాలయ్యాయి. తీగలు, కర్రలతో బాబును రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బాబు స్నేహితులు కొండ దిగి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. కేరళ రెస్క్యూ యూనిట్ సహా పోలీసులు అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విజిబిలిటీ సమస్యల కారణంగా వారు రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించలేకపోయారు. అయితే బాబుకు భద్రత కల్పించేందుకు ఆ బృందం సమీపంలోనే ఉండిపోయింది. రాత్రి సమయంలో అడవి జంతువులను దూరంగా ఉంచేందుకు బృందం మంటలను వెలిగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles