Priyanka Gandhi bats for ‘ladki hoon’ on hijab row హిజబ్ వివాదం: మహిళలకు అండగా నిలిచిన ప్రియాంక గాంధీ

Bikini ghoonghat or hijab it s woman s right to wear what she wants priyanka gandhi

Priyanka Gandhi, Priyanka, Priyanka Gandhi Vadra, hijab row in Karnataka, hijab row, hijab, Karnataka hijab row, hijab controversy, PU College in Udupi, Priyanka Gandhi hijab row, priyanka gandhi jeans row, hijab meaning, karnataka hijab news, karnataka news, hijab controversy, hijab karnataka, high court of karnataka, basavaraj bommai, karnataka cm party, karnataka hijab row high court, hijab issue in karnataka, karnataka high court, karnataka government, karnataka, Politics

Amid the ongoing protests over the hijab ban in Karnataka colleges, Congress general secretary Priyanka Gandhi Vadra on Wednesday said women had the right to decide what to wear. In a tweet with the hashtag #ladkihoonladsaktihoon, the party’s campaign theme for the Uttar Pradesh Assembly poll, Ms. Vadra said the right was guaranteed by the Constitution.

హిజబ్ వివాదం: మహిళలకు అండగా నిలిచిన ప్రియాంక గాంధీ

Posted: 02/09/2022 02:53 PM IST
Bikini ghoonghat or hijab it s woman s right to wear what she wants priyanka gandhi

కర్ణాటకలో హిజాబ్ వివాదం ఎంత ముదురుతోందో తెలిసిందే. కాలేజీలోకి హిజాబ్ ను అనుమతించకపోవడంతో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన.. పెను దుమారాన్నే రేపింది. మూడు రోజుల పాటు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించేదాకా వెళ్లింది పరిస్థితి. హిజాబ్ వివాదంపై స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హిజాబ్‌కు అనుకూలంగా ప్రకటనలు చేశారు. యువతలు, మహిళలకు అమె అండగా నిలిచారు. మహిళలు ఏమి ధరించాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి వారికి సంపూర్ణమైన హక్కు ఉంది అని అమె పేర్కొన్నారు.

ఈ మేరకు ప్రియాంకగాంధీ తన ట్విటర్‌లో ఖాతాలో హిజబ్ సహా మహిళలు, యువతులకు అండగా నిలిచారు. ఈ క్రమంలో అమె "బికినీ, ఘూంఘట్, జీన్స్ లేదా హిజాబ్ ఏదైనా ధరించడం మహిళ యొక్క హక్కు. అది మహిళలకు రాజ్యాంగం ప్రసాదిస్తున్న ప్రాథమిక హక్కు అని, ఇకనైనా మహిళలను వేధించడం మానుకోవాలని" అని అమె ట్వీట్ చేశారు. మహిళల వస్త్రాధారణపై మాట్లాడేందుకు ఎవరికీ హక్కులేదని అమె అన్నారు.

అయితే, ప్రియాంకాగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే రేణుకాచార్య స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బికినీ అని కామెంట్ చేయడంతోనే ప్రియాంక గాంధీ ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చంటూ కామెంట్ చేశారు. కాలేజీకి, స్కూలుకు వెళ్లినా విద్యార్థులంతా నిండుగా బట్టలేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. మహిళల వస్త్రధారణ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని, మగవారిని రెచ్చగొడుతున్నారని ఆయన వివాదం రాజేశారు. అది సరికాదన్నారు. మహిళలకు మన దేశంలో ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles