MoS Finance Pankaj Chaudhary on Rs. 10 Coins Validity రూ.10 నాణేలతో అన్ని లావాదేవీలు జరుపొచ్చు: కేంద్ర ఆర్థికశాఖ

Mos finance pankaj chaudhary on rs 10 coins validity

union minister pankaj chaudhary, rbi, pankaj chaudhary, aidmk leader vijay kumar, 10 rupee coin, Rajya Sabha, Parliamnent, Economy, Finance

union minister pankaj chaudhary assures the rajya sabha on the validity of rs 10 coins, says they are valid for all type of transactions.

రూ.10 నాణేలతో అన్ని లావాదేవీలు జరుపొచ్చు: కేంద్ర ఆర్థికశాఖ

Posted: 02/09/2022 05:50 PM IST
Mos finance pankaj chaudhary on rs 10 coins validity

భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన పది రూపాయల నాణేల విషయంలో దేశవ్యాప్తంగా ఇంకా అనుమానాలు తిష్టవేసి ఉన్నాయి. ఈ రూ.10 రూపాయల కాయిన్లను ఏదైనా దుకాణంలో ఇస్తే తీసుకోమంటూ తిరస్కరించిన అనుభవలు ఇప్పటికే చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అందుకు కారణం ఈ నాణేలను కేంద్రప్రభుత్వం రద్దు చేసిందన్న వాదనలు తెరపైకి రావడమే. రూ. పది నాణేలాతో జరిగే లావాదేవీలను భారతీయ రిజర్వు బ్యాంకు నిషేధించిందని విషప్రచారం జరగింది. ఈ మేరకు బలంగా ప్రచారం జరగడంతో అన్నిచోట్ల రూ.10 నాణేనికి తిరస్కారమే ఎదురవుతొంది.

దీంతో రూ.10 నాణేలను చిల్లరకొట్టు నుంచి సూపర్ మార్కెటు వరకు.. టీ కోట్టు నుంచి ఫైస్టార్ రెస్టారెంట్ల వరకు తిరస్కరణకు గురవుతున్నాయి. వీటితో ఎలాంటి లావాదేవీలు జరిపినా ఎవరూ తీసుకోకపోవడంతో, తమ వద్దే ఇప్పటికే పోగైన రూ. 10 నాణేలను ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులు చాలా మంది వ్యాపారులలో నెలకొన్నాయి. రూ. 10 కాయిన్స్ తమను ఇబ్బంది పెడుతున్నాయని చాలా మంది వ్యాపారులు భావిస్తున్నారు. కానీ, 10 రూపాయి నాణేలు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు.

రాజ్యసభలో రూ. 10 నాణేలా అంశాన్ని ఒక సభ్యుడు ప్రస్తావించారు. వీటితో లావాదేవీలను నిషేధించారా అని ప్రశ్న వేయడంతో మంత్రి స్పందించారు. రూ.10 కాయిన్లు చెల్లుబాటు కావడం లేదా? వీటి కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? అంటూ అన్నాడీఎంకే ఎంపీ విజయ్ కుమార్ ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఆర్బీఐ ముద్రించే రూ.10 కాయిన్లను అన్ని రకాల లావాదేవీలకు వినియోగించుకోవచ్చని చెప్పారు. అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని బదులిచ్చారు. ఇందుకు సంబంధించి ప్రజల్లో అవగాహన కోసం ఆర్బీఐ పత్రికా ప్రకటనలు ఇస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles