"No political parties involvement in Chalo vijayawada" ‘ఛలో విజయవాడ’పై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందన

No involvement of political parties in employees chalo vijayawada says unions

telugu desam, TDP, janasena, teachers, govt employees, chalo vijayawada, YSRCP Government, pay revision commission, Venkatrami Reddy, Andhra pradesh, politics

AP Government Employees Federation President Venkatrami Reddy said the Chalo Vijayawada program was a success and opined that Vijayawada has never seen such a movement in history. Meanwhile, the employees union leaders made it clear that none of the TDP and Jana Sena parties were involved in the Chalo Vijayawada agitation.

‘ఛలో విజయవాడ’కు ఏ పార్టీతో సంబంధం లేదు: ఉద్యోగ, ఉపాధ్యయ సంఘాలు

Posted: 02/04/2022 07:18 PM IST
No involvement of political parties in employees chalo vijayawada says unions

రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కొత్త పీఆర్సీ వేతన విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తలపెట్టిన ‘ఛలో విజయవాడ’కు విజయవాడ వీధులన్నీ పోటెత్తేలా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరైన విషయం తెలిసిందే. ప్రభుత్వం అంక్షలు విదించినా.. పోలీసుల పహారాను దాటుకుని వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరుకావడంతో తమ డిమాండ్లను ప్రభుత్వానికి గట్టిగానే వినిపించారు. అయితే ఇది కేవలం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే సాగిన నిరసన కార్యక్రమం అని ఉపాధ్యయ, ఉద్యోగ సంఘాల నేతలు పేర్కోంటున్నారు.

పీఆర్సీకి ముందు తమకు లభించే వేతనాలు బాగున్నాయని పీఆర్సీతో తమ వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గడం ఏంటని.. దీనిని నిరసిస్తూనే ఉద్యోగ ఉపాద్యాయులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారని అంటున్నారు. అయితే ప్రభుత్వంలోని పలువురు మాత్రం ఉపాద్యాయ, ఉద్యోగ సంఘాలకు మద్దతుగా పార్టీలు కూడా తమ కార్యకర్తలను రెచ్చగోట్టి విజయవాడకు పంపించాయని అరోపిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేందుకు ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల చలో విజయవాడ పిలువును ప్రత్యర్థి పార్టీలు వాడుకున్నాయని అరోపిస్తున్నారు. దీంతోనే ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరనసలు విజయవంతమయ్యాయని నిరూపించుకోవాలని భావించారని ఆరోపిస్తున్నారు.

అయితే ఛలో విజయవాడ కార్యక్రమంతో ఏ రాజకీయ పార్టీకి సంబంధంలేదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. నిన్నటి 'ఛలో విజయవాడ' కార్యక్రమంలో టీడీపీ, జనసేన, మరే ఇతర పార్టీలకు చెందినవారు పాల్గొనలేదని అన్నారు. దీనిపై అసత్య ప్రచారం చేయవద్దని కోరారు. ఉద్యోగులకు మద్దతుగా పవన్ కల్యాణ్ వంటి వారు ఎవరు ముందుకు వచ్చినా మంచిదేనని వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం లేదని, అయితే కొందరు వ్యక్తులు ఉద్యోగుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఛలో విజయవాడ కార్యక్రమంతో ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నూడ లేని విధంగా ఉపాద్యాయ, ఉద్యోగ సంఘాల ఉద్యమం విజయవంతం అయ్యిందని అన్నారు. ఇంతటి తీవ్రస్థాయిలో ఉద్యమం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. కాగా, పీఆర్సీ ఉద్యమంపై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఇవాళ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు, దీంతో సచివాలయంలోని ఉద్యోగులు ఎవరూ తమ కంప్యూటర్లను అన్ చేయలేదు, దీంతో ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇవాళ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి, ఇక శనివారం రోజు సెలవు కావడంతో సోమవారం మాత్రమే ప్రభుత్వ వ్యవహారాల్లో కదిలిక రానుంది. పీఆర్సీ జీఓలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు, తమ డిమాండ్లను పరిష్కరించే వరకు కార్మికులు సమ్మెను కొనసాగిస్తారని తెలిసింది. అయితే సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles