SC Directs States Not To Reject corona death Claims కరోనా పరిహారంలో రాష్ట్రాలకు సుప్రీం అల్టిమేటం

Covid 19 death compensation supreme court directs states not to reject claims

supreme court, corona deaths, covid compenstation, corona compensation, Gaurav Bansal v. Union of India, covid 19, ex-gratia compensation for COVID-19 deaths, claims filed offline, Justices M.R. Shah and B.V. Nagarathna, state governments, National, crime

The Supreme Court directed the State Governments to accept all applications, irrespective of whether they have been filed online or not. The Apex Court categorically observed that no application can be rejected on the ground that they were filed offline. The Court has granted the State Governments a week's time to review the decision of rejecting claims filed offline.

కరోనా పరిహారంలో రాష్ట్రాలకు సుప్రీం అల్టిమేటం

Posted: 02/05/2022 03:34 PM IST
Covid 19 death compensation supreme court directs states not to reject claims

కరోనా మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తు చట్టం కింద రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చూపించిన కరోనా మృతుల వివరాలు పూర్తిగా అవాస్తవమని పేర్కోన్న అత్యున్నత న్యాయస్థానం బాదితులందరికీ పరహారాన్ని చెల్లించాలని అదేశాలు జారీ చేసింది. కరోనా మృతులకు పరిహారం చెల్లించే విషయంలో మరోసారి సర్వోన్నత న్యాయస్థానం చొరవ చూపించింది. రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా మరణాల విషయంలో అధికారిక గణాంకాలు నిజం కావని తేల్చేసింది.

కరోనా పరిహారం కోరుతూ వచ్చే దరఖాస్తులను సాంకేతిక కారణాలు చూపిస్తూ తిరస్కరించడం కుదరదని.. పరిహారం చెల్లింపునకు 10 రోజుల వ్యవధినిస్తున్నామని పేర్కొంది. ‘‘మృతులకు సంబంధించిన అధికారిక గణాంకాలు నిజం కావు. మోసపూరిత క్లెయిమ్ లు వచ్చాయని చెప్పడం కుదరదు’’అని జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కరోనాతో మరణించిన ప్రతి వ్యక్తికి రూ.50 వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు చెల్లించే కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తుండడం తెలిసిందే.

పరిహారం చెల్లింపుల్లో కొన్ని రాష్ట్రాల తీరు పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలకు సాయం చేయడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తు చేసింది. ‘మీరు ఏమీ దానం చేయడం లేదు’ అని వ్యాఖ్యానించింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన రోజు నుంచి 30 రోజుల్లోపు మరణించిన కేసులకు పరిహారం చెల్లించాలని లోగడ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆత్మహత్య చేసుకున్నా పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు విచారిస్తోంది. మరోపక్క, మహారాష్ట్ర అత్యధికంగా 60 వేల దరఖాస్తులను తిరస్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles