Asaduddin Owaisi to get ‘Z’ category status అసదుద్దీన్ ఒవైసీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత.. అందుకే కాల్పులు

Aimim chief asaduddin owaisi gets z security cover after attack

asaduddin owaisi attack, asaduddin owaisi crpf z security, aimim asaduddin owaisi z category security, crpf z category security for asaduddin owaisi, what is z category security, Asaduddin Owaisi, convey attack, Z category security, AIMIM, Hyderabad MP, CRPF securitym uttar pradesh, Crime

The government on Friday decided to provide 'Z' category security by commandos of the CRPF to prominent Muslim leader and Hyderabad MP Asaduddin Owaisi. The Government of India has reviewed the security of AIMIM MP Asaduddin Owaisi and provided him with Z category security of CRPF with immediate effect.

అసదుద్దీన్ ఒవైసీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత.. అందుకే కాల్పులు

Posted: 02/04/2022 06:01 PM IST
Aimim chief asaduddin owaisi gets z security cover after attack

ఎంఐఎం చీఫ్ లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి మరింత పటిష్ఠ భద్రతను కేంద్రం కల్పించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన కారుపై గురువారం దుండగులు కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా తప్పించుకున్నారు. ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావిస్తానని ఆయన ప్రకటించారు. దాడి నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ భద్రతను కేంద్రహోంశాఖ సమీక్షించింది. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జెడ్ కేటగిరీలో 22 మంది రక్షణ సిబ్బంది ఉంటారు. ఇందులో నాలుగు నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు.

మరోవైపు అసుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఉదయం స్పందిస్తూ.. తాను భద్రతను ఎప్పుడూ కోరలేదని, కోరబోనని స్పష్టం చేశారు. ఎందుకంటే తన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. యూపీలో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో హపూర్-ఘజియాబాద్ జాతీయ రహదారిపై జిరార్సి టోల్ ప్లాజా సమీపంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఒవైసీపై దాడి జరింది. ఒవైసీపై దాడి జరిగిన ఘ‌ట‌న‌పై ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ జ‌రిపి వివ‌రాలు వెల్ల‌డించారు. నిందితులు గత కొన్ని రోజులుగా ఒవైసీని ఫాలో అవుతున్నార‌ని దర్యాప్తులో తేలిందని చెప్పారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఒవైసీ నిర్వ‌హించిన‌ సభలు, ర్యాలీల్లో ఆయ‌న చేసిన ప్రసంగాలు న‌చ్చ‌కే నిందితులు ఆయ‌న‌పై దాడి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని, కాల్పుల ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు వివ‌రించారు. సదరు నిందితులు ఒవైసీ నిర్వ‌హించిన‌ మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు కూడా హాజరయ్యార‌ని చెప్పారు. ఆయా ర్యాలీల‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిజానికి నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని ఫాలో అవుతున్న‌ప్ప‌టికీ ఆ స‌మ‌యంలో దాడి చేసే అవకాశం వారికి రాలేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles