Supreme Court On Husband Property if will written భర్త ఆస్తిపై భార్యకు పూర్తి హక్కులు ఉండవు.. సుప్రీంకోర్టు

Wife can t become absolute owner of property willed for her lifetime sc

wife, husband properties, full-rights, assets and properties, haryana case, supreme-court, will, testament

A Hindu male, owning self-acquired property executing a Will giving a limited estate to his wife, would not mature into an absolute right, if all other aspects including maintenance are taken care of, the Supreme Court on said.

వీలునామా రాస్తే.. భర్త ఆస్తిపై భార్యకు పూర్తి హక్కులు ఉండవు: సుప్రీంకోర్టు

Posted: 02/02/2022 03:29 PM IST
Wife can t become absolute owner of property willed for her lifetime sc

భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు సంక్రమించే హక్కులపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త కనుక పరిమితులతో కూడిన వీలునామా రాస్తే దానిపై పూర్తి హక్కులు ఆమెకు సంక్రమించబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. హర్యానాకు చెందిన తులసీరామ్ కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లు చేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా.. పరిమితులతో కూడిన వీలునామ రాసిన పక్షంలో భర్త అస్తులపై ఆమెకు సంపూర్ణ హక్కులు లభించవని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్ ల సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హర్యానాకు చెందిన తులసి రామ్.. మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య రామ్ దేవి, కుమారుడు పేరున 1968లో వీలునామా రాశారు. తన ఆస్తిని ఆమె జీవితాంతం అనుభవిస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణానంతరం తన యావదాస్తి సంపూర్ణంగా తన కుమారుడికే  చెందాలని అందులో స్పష్టం చేశాడు. తరువాత తులసీరామ్ 1969లో మృతి చెందాడు. అయితే, కొందరు వ్యక్తులు రామ్ దేవి నుంచి ఆ ఆస్తిని కొనుగోలు చేయడం వివాదానికి దారి తీసింది.

ఈ కేసుపై విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. రాందేవి నుంచి ఈ ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులకు అనుకూలంగా జరిగిన విక్రయాలు చట్టబద్దం కాదని.. దానిని అలా కొనసాగించలేమని ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా, మరో కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టుపై అసంబద్ద అరోపణలు చేసిన వ్యక్తి కోర్టు ఖర్చుల కింది రూ. 25 లక్షలు చెల్లించాలని జనవరి 4న తామిచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించుకుంది. ‘ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట పడాలి. ఈ సందేశం అత్యంత బలంగా.. స్పష్టంగా వెళ్లాలి. అందుకే ఈ అదేశాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు’ అని జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ సి.టి. రవికుమార్ ల ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే న్యాయస్థానంపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తన పొరపాటు తెలుసుకున్నారని, భవిష్యత్తులో అత్యంత జాగ్రత్తగా ఉంటారని, ఔదార్యం చూపించాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించారు. కాగా, తానొక పింఛన్ దారుడినని, ఒక నెల పింఛన్ కోర్టులో జమ చేస్తానని, రూ. 25 లక్షలు కట్టడం తనవల్ల కాదని న్యాయవాది ద్వారా పిటిషన్ దారుడు తెలిపారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ.. నిజానికి తాము కోర్టు ధిక్కారణ చర్యల్ని ఆయన మీద ఇప్పటికే మొదలు పెట్టి ఉండాలని, అలా చేయలేదని తెలిపింది. ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను వారం రోజుల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wife  husband properties  full-rights  assets and properties  haryana case  supreme-court  will  testament  

Other Articles