congress questions FM over legality of Cryptocurrency క్రిప్టోకరెన్సీపై పన్ను విధానంపై రాజకీయ రచ్చ..

Cryptocurrency tax budget proposal spurs talk of legality grey area

Finance minister Nirmala Sitharaman,union budget 2022,budget india,budget,total budget of 2022,proposed budget 2022,india 2022 budget,healthcare budget,health budget of india 2022,health budget of india,government budget of 2022,government budget for 2022,government budget 2022,general budget 2022,fm nirmala sitharaman,fiscal budget 2022,railway budget in india,central budget 2022

Congress general secretary and chief spokesperson Randeep Surjewala questioned Finance Minister, please do tell the Nation – Is Crypto Currency now legal, without bringing the Crypto Currency Bill, as you tax the crypto currency? “What about its regulator? What about regulation of Crypto Exchanges? What about investor protection?

క్రిప్టోకరెన్సీపై పన్ను విధానంపై రాజకీయ రచ్చ.. విమర్శల వెల్లువ

Posted: 02/02/2022 01:32 PM IST
Cryptocurrency tax budget proposal spurs talk of legality grey area

కేంద్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని ఇప్పటికే దేశానికి చెందిన పలువురు రాజకీయ నేతలు, ఆర్థిక రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. కాగా బడ్జెట్ లో పలు వర్గాలకు చెందిన వారిని అసలు ప్రభుత్వం పట్టించుకోలేదని, గుర్తించలేదని రైతులను, మధ్యతరగతి వారిని వదిలేసిందని అరోపణలు మిన్నంటాయి. ఈ క్రమంలో ఈ సారి క్రిప్టో కరెన్సీని అధికారికంగా ఇప్పటికీ గుర్తించని కేంద్రం.. దానిపై సమకూరే లాభంపై మాత్రం ముప్పై శాతం పన్ను విధిస్తామని చెప్పడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. క్రిప్టో కరెన్సీపై పన్నువేస్తున్నట్టు ప్రకటించడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. క్రిప్టో కరెన్సీ పన్నువిధానం కేంద్రం దోపిడి విధానానికి నిదర్శనమని దుయ్యబట్టింది.

దేశంలోని ప్రజలను అన్ని విధాలుగా ముక్కుపిండి పన్నులను వసూళ్తు చేస్తున్న కేంద్రం.. క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయకుండానే.. అసలు సంబంధిత బిల్లు తీసుకురాకుండానే పన్ను ఎలా వసూలు చేస్తారని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశానికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. అసలు రెగ్యులేషన్ పరిస్థితి ఏంటి? క్రిప్టో ఎక్స్చేంజీల నియంత్రణ సంగతేంటి? ఇన్వెస్టర్ల రక్షణ ఏంటని ప్రశ్నలు సంధించారు. క్రిప్టో కరెన్సీతో కొందరు లాభాలను అర్జిస్తున్నారన్న విషయం తెలియగానే దానిపై పునరాలోచన చేయాల్సిన ప్రభుత్వాలు.. చట్టబద్దం చేసిన తరువాత పన్నువిధానాన్ని ప్రవేశ పెట్టాలి కానీ.. అలా కాకుండా ముందుగానే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం నిజంగా విడ్డూరంగానే వుందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయాన్ని తప్పుబట్టారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చా జరగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని, కానీ బడ్జెట్‌లో మాత్రం దాని గురించి ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిప్టో క‌రెన్సీ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందిస్తూ 30 శాతం ప‌న్ను వ‌సూలు చేస్తామ‌ని బ‌డ్జెట్‌లో ప్ర‌స్తావించడంపై ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. అసలు చట్టబద్దత లేని క్రిప్టో కరెన్సీపై పన్నును ఎలా వ‌స్తూలు చేస్తారని ప్రశ్నించారు. క్రిప్టో క‌రెన్సీని మీరు ఒప్పుకున్నారా? అది అఫిషియ‌లా? దీనికి మీ స‌మాధానం ఎంటి? అని ప్రశ్నించారు.

ఏ ప్రాతిప‌దిక‌న క్రిప్టో క‌రెన్సీ మీద ప‌న్ను వసూలు చేస్త‌ారు. ఇది సెన్స్‌లెస్ కాదా? మీరు ఏదైనా మాట్లాడుత‌ారు.. మీకు న‌చ్చింది చేస్త‌ారు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా అడుగుతున్నా.. క్రిప్టో క‌రెన్సీని మీరు అఫిషియ‌ల్ చేశారా? అస‌లు కేంద్ర ప్ర‌భుత్వానికి దిమాక్ ఉందా? అని సీఎం కేసీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. కాగా, నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో.. దేశంలో వర్చువల్ డిజిటల్ కరెన్సీ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, కాబట్టి దీనిపై పన్ను విధిస్తున్నట్టు చెప్పారు. వర్చువల్ ఆస్తుల బదిలీపై 30 శాతం చొప్పున పన్ను విధిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు ఒక శాతం టీడీఎస్ కూడా విధిస్తున్నట్టు పేర్కొన్నారు. వర్చువల్ ఆస్తులు గిఫ్ట్ రూపంలో అందించినా ఇదే పన్ను వర్తిస్తుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles