Mother drops her 3yr-old daughter into bear's den మూడేళ్ల బిడ్డను ఎలుగుబంటి బోనులోకి విసిరిన కన్నతల్లి

Shocking mother drops her three year old daughter into bear s den

mother threw daughter into a bear's enclosure, three-year-old baby girl in bear's den, shocking video of mother droping baby into bear den, ZOO, Bear, Den, child, throw, Mother, Tashkent, Uzbegisthan, CCTV camera footage, viral video, trending video, shocking video

In a shocking incident from Uzbekistan's capital Tashkent, a mother threw her three-year-old daughter into a bear's enclosure at a zoo. The incident was captured in a CCTV camera. The onlookers watched in horror as the mother, who was holding her child over the railings, droped the baby girl into the bear's den.

ITEMVIDEOS: షాకింగ్: మూడేళ్ల బిడ్డను ఎలుగుబంటి బోనులోకి విసిరిన కన్నతల్లి

Posted: 02/02/2022 04:31 PM IST
Shocking mother drops her three year old daughter into bear s den

ఎంతటి కష్టం వచ్చినా.. తాను కష్టాలను, నష్టాలను భరించి బిడ్డలకు మాత్రం బంగారు భవిష్యత్తును అందించడం తల్లిదండ్రులు చేసే పని. ఇక బిడ్డలకు ప్రాణాలకు ముప్పుందని తెలిసినా.. తాము వాటిని ఎదుర్కోని బిడ్డలను రక్షించుకునే మాతృమూర్తులను చూశాం. కానీ ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడి స్థానికులు షాక్ కు గురయ్యారు. ఒక తల్లి తన మూడేళ్ల కుమార్తెను జంతుప్రదర్శనశాలలో ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి విసిరివేసింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. రెయిలింగ్‌పై బిడ్డను పట్టుకున్న తల్లి ఎలుగుబంటి గుహలోకి పసికందును పడవేయడాన్ని చూసిన కొందరు భయాందోళన వ్యక్తం చేశారు.

ఎంతటి కష్టం వచ్చినా ఇలా కన్నబిడ్డను తన కళ్ల ముందే వన్యప్రాణికి బలిస్తారా.? అని స్థానికులు అమెను ప్రశ్నించారు. వివరాల్లోకి వెళ్తే..  ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లోని తన మూడేళ్ల చిన్నారితో కలసి వెళ్లిన తల్లి అమెకు.. జుజు అనే మగ కాకేసియన్ ఎలుగుబంటిని చూపించేందుకు అలా పైకి ఎత్తుకుంది. అంతే అదే సమయంలో ఇంకాస్త పైకి ఎత్తి గ్రిల్స్ పై నుంచి ఎలుగుబంటి ఉండే ఎన్ కోజర్ లోకి విసిరేసింది. అయితే అమె విసిరిందా.. లేక చేయిజారి పడిందా.? అన్న విషయం తెలియదు కానీ.. చూస్తుండగానే ఎలుగుబంటి బోనులోకి మూడేళ్ల చిన్నారి పడిపోయింది. అంతే ఎలుగుబండి వెంటనే బాలిక వద్దకు చేరుకుని బతికివుందా.? అన్నట్లుగా వాసన చూసింది.

వెనువెంటనే రంగంలోకి దిగిన జూ సిబ్బంది ఎలుగుబంటిని దాని బోనులోపలికి పంపించి.. చిన్నారి పాపను రక్షించడంతో సఫలమయ్యారు. దీంతో అక్కడున్నవారందరూ హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫూటేజీలో నిక్షిఫ్తం కావడం.. వాటిని జూ అధికారులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇక అంతకుమించి ఆశ్చర్యం ఏంటంటే, ఈ సంఘటన అంతా తల్లి అక్కడే ఉండి చూస్తూనే ఉంటుంది. అయితే బిడ్డను ఉద్దేశపూర్వకంగానే అమె పడేసిందన్న అభియోగాల నేపథ్యంలో అమెను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

అయితే తల్లి ఉద్దేశపూర్వకంగా తన మూడేళ్ల ఆడబిడ్డను ఎలుగుబంటి బోనులోకి విసిరినా.. జూ సిబ్బంది సమయస్పూర్తిగా వ్యవహరించిన కారణంగా అమె సురక్షితంగా బయటపడింది. కాగా ఎత్తు నుంచి కిందపడటంతో చిన్నారికి తలకు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో బాలికను తాష్కెంట్‌లోని ఆస్పత్రిలో చేర్పించిన అధికారులు అమెకు చికిత్సను అందిస్తున్నారు. ఆ మహిళ తన ఆడబిడ్డను అందరి ముందే ఎలుగుబంటి గుహలో పడేసిందని జూ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఇప్పటి వరకు మహిళ ఉద్దేశం తెలియరాలేదు. అయితే బాలిక వాసన చూసిన ఎలుగుబంటి తన తల్లి వైపు చూస్తూ ఉండిపోయి పాపకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పోవడం విశేషం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ZOO  Bear  Den  child  throw  Mother  Tashkent  Uzbegisthan  CCTV camera footage  viral video  trending video  shocking video  

Other Articles