Neo Cov coronavirus pose threat to humans in future నియోకోవ్ వైరస్‌: ప్రతీ ముగ్గరిలో ఒకరికి మరణ తప్పదన్న చైనా! t

Wuhan scientists warn of neocov with high death rate and spread says report

NeoCov, coronavirus, variant, respiratory syndrome, viral disease, SARS-CoV-2, human cells, Middle Eastern Respiratory Syndrome (MERS), molecular barrier, South Africa, Wuhan Scientists, china researchers, Bats, Wuhan University, china

A single molecular change in the lab enabled a coronavirus called Neocov to “efficiently infect” human cells using the same pathway that the SARS-CoV-2 uses to infect human cells, researchers from Wuhan University, Wuhan, China said in a report that is yet to be peer-reviewed.

నియోకోవ్ వైరస్‌: పొంచివున్న పెను ప్రమాదం.. ప్రతీ ముగ్గరిలో ఒకరికి మరణ తప్పదన్న చైనా!

Posted: 01/29/2022 10:49 AM IST
Wuhan scientists warn of neocov with high death rate and spread says report

కరోనా మహమ్మారి మూడవ దశ ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే ఈ వేరియంట్ అందరికీ సోకి తగ్గడంతో సహజంగా బాధితుల్లో ఉత్పన్నమయ్యే యాంటి వైరల్స్ కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని వైద్యనిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఇక మూడవదశ ఇప్పుడిప్పుడే తగ్గుతూ జనం ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. ఇక ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌పొచ్చ‌ని అనుకుంటున్న ప్ర‌తిసారి కొత్త రూపంలో విరుచుకుప‌డుతూనే ఉంది. క‌రోనా వైర‌స్ సృష్టిస్తున్న ఈ అరాచ‌కం నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని ఆశ‌గా ఎదురుచూస్తున్న జ‌నాల‌పై మ‌రో బాంబు పేల్చారు వుహాన్ శాస్త్ర‌వేత్త‌లు.

క‌రోనా వైర‌స్‌ను పోలిన కొత్త ర‌కం వైర‌స్‌ను గుర్తించిన‌ట్లు చైనా మరో షాకింగ్ ప్రకటన చేసింది. ఇది క‌రోనా వైర‌స్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని.. ఇది గ‌నుక విజృంభిస్తే ప్ర‌తి ముగ్గురిలో ఒక‌ మరణం నమోదు అవుతుందని హెచ్చ‌రిస్తున్నారు. వుహాన్ సైంటిస్టులు చెప్పిన ఈ విష‌యాన్ని ప్రపంచం మొత్తాన్ని మ‌రోసారి భ‌యాభ్రాంతుల‌కు గురి చేస్తోంది. నియోకోవ్ కరోనా వైరస్ రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వైరస్ గబ్బిలాల నుంచి జంతువులకు సోకుతుందని వూహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియోకోవ్ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్ర‌స్తుతం నియోకోవ్ వైర‌స్ జంతువుల్లో మాత్ర‌మే వ్యాప్తి చెందుతుంద‌ని వుహాన్ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. అలా అని ఈ వైర‌స్‌ను తేలిగ్గా తీసుకోవ‌డానికి వీల్లేద‌ని.. ఇది మ‌నుషుల‌కు కూడా సోకే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. గ‌బ్బిలాల్లోని యాంజియో టెన్సిన్ క‌న్వ‌ర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ2)ను స‌మ‌ర్థంగా వాడుకుని నియోకోవ్ వైర‌స్ మ‌నుగ‌డ సాధిస్తుంది. అయితే ఈ వైర‌స్‌ మ‌నుషుల్లోని ACE2ను ఏమార్చి మ‌నిషి శ‌రీరంలోకి ప్ర‌వేశించే సామ‌ర్థ్యం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. కాక‌పోతే ఈ నియోకోవ్ లోని ఒక మ్యుటేష‌న్ కార‌ణంగా మ‌నుషుల‌కు సోకే అవకాశం కూడా ఉంద‌ని హెచ్చరించారు. వుహాన్ యూనివ‌ర్సిటీ, చైనీస్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోఫిజిక్స్ చేసిన ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles