Shweta Tiwari apologises for controversial God remark నటి శ్వేతా తివారీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఆనక క్షమాపణలు

Fir against shweta tiwari for hurting religious sentiments with bra comment

shweta tiwari, shweta tiwari controversy, shweta tiwari god is taking my bra size, shweta tiwari bhagwan comment, shweta bhagwan bra comment, shweta tiwari innerwear controversy, saurabh raaj jain, show stopper web series, shweta tiwari web series, shweta tiwari case, 295a ipc case against shweta tiwari bhopal, crime

Shweta Tiwari recently courted controversy after she said in an interview 'God is taking my bra size'. The actress was promoting her upcoming web show, Show Stopper, in Bhopal when she made this controversial remark. Now, days after her controversy, Shweta has broken her silence on the matter. The actress has also apologised for hurting the sentiments of people.

నటి శ్వేతా తివారీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఆనక క్షమాపణలు

Posted: 01/28/2022 01:17 PM IST
Fir against shweta tiwari for hurting religious sentiments with bra comment

బాలీవుడ్, హిందీ టీవీ సీరియళ్ల నటి శ్వేతా తివారీ నోరుజారి కష్టాలను కొనితెచ్చుకున్నారు. అమె ఓ ఇంటర్య్వూలో చేసిన తన వ్యాఖ్యలతో దుమారం రాజేశారు. దేవుడి విషయంలో కొందరి మనోభావాలను గాయపరిచేలా మాట్లాడారు. దీంతో అమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హిందూత్వవాదులు డిమాండ్ చేస్తున్నారు. పాపులారిటీ రాగానే దేనితో దేవుడిని పోలుస్తున్నామన్న ఇంకితజ్ఞానం కూడా లేకుండా అమె వ్యాఖ్యలు చేయడాన్ని హిందుత్వవాదులు తప్పబడుతున్నారు. ఆమె నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రారంభ కార్యక్రమం భోపాల్ లో జరిగింది.

శ్వేతా తివారీ తాజాగా న‌టించిన వెబ్ సిరీస్ షో స్టాప‌ర్‌. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆమె స‌హ‌న‌టుడు రోహిత్ రాయ్‌తో క‌లిసి భోపాల్‌లో విలేక‌రుల స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శ్వేత‌ తివారీ భ‌గ‌వంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీశారంటూ నెటిజ‌న్లు న‌టిని దుమ్మెత్తిపోశారు. ఇంతకీ అమె ఏమన్నారంటే.. "నా బ్రా సైజును దేవుడే తీసుకుంటున్నాడు. చాలా మందికి ఇది నచ్చడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అగ్గిరాజేయడంతో అమెపై వెనువెంటనే కేసు నమోదైంది.

భోపాల్‌లోని శ్యామ‌ల హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఆమెపై కేసు కూడా న‌మోదైంది. ఈ వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి వెళ్లాయి. ‘‘నేను శ్వేతా తివారీ ప్రకటన చూశాను. దీన్ని ఖండిస్తున్నా. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని భోపాల్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాను. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి ప్రకటించారు. ఆయన ఆదేశాలతో శ్వేతా తివారీకి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద శ్యామలాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టించిన నేపథ్యంలో మెట్టుదిగిన నటి తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. తాను అలాంటి ఉద్దేశ్యంతో అలా వ్యాఖ్యానించలేదని.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అమె రోటిన్ డైలాగ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles