కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనవరాలు సౌందర్య నీరజ్ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్‌లో ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని వసంతనగర్ లోని అపార్ట్ మెంటులో నివసిస్తున్న ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తున్నారు. యడియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురే సౌందర్య.
వృత్తి రిత్యా డాక్టర్ అయిన సౌందర్యకు.. అదే వృత్తిలో వున్న నీరజ్ అనే డాక్టరుతో 2019లో వివాహం జరిగింది. మూడేళ్ల వీరి దాంపత్య జీవితం సాఫీగానే వుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే అమె ఇవాళ ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లిన పనిమనిషి ఎప్పటిలాగానే తలుపు తట్టింది. అయితే ఎంత సేపటికీ తలుపు తెరుచుకోలేదు. దీంతో, ఏం చేయాలో తెలియని పనిమనిషి వెంటనే అమె భర్త డాక్టర్ నీరజ్ కు ఫోన్ చేసింది. దీంతో హుటాహుటిన నీరజ్ ఇంటికి వచ్చారు. తలుపులను బలంగా తెరిచి లోపలకు వెళ్లగా సీలింగ్ ఫ్యాన్ కు ఆమె వేలాడుతూ కనిపించింది.
ప్రాథమిక ఆధారాలను బట్టి కేసును ఆత్మహత్యగా పోలీసులు నమోదు చేశారు. మరోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొంత కాలంగా సౌందర్య డిప్రెషన్ లో ఉన్నారని తెలుస్తోంది. సౌందర్య స్థానికంగా ఉన్న ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. సౌందర్య మృతదేహాన్ని బెంగళూరు ఉత్తర అబ్బిగెరె నీరజ్‌ఫామ్ హౌజ్‌కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే అమె ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more