HC questions Telangana govt. on schools reopening పాఠశాలలను తెరుస్తున్నారా.? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Telangana high court questions government on reopening of schools

Telangana High Court, reopening of schools, Omicron variant, COVID-19, Corona Updates, Government of Telangana, Hyderabad, Telangana

The Telangana high court on Friday questioned government on the opening of schools in the state. The court asked if the government is opening schools from January 31. Responding to the court, the advocate general said that no decision has been taken by the government on reopening of schools in the state.

పాఠశాలలను తెరుస్తున్నారా.? తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Posted: 01/28/2022 12:15 PM IST
Telangana high court questions government on reopening of schools

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నా.. పాఠశాలలను త్వరలో తెరువనున్నట్లు వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. తొలుత ఫిబ్రవరి 5 నుంచి పాఠశాలలు తెరువనున్నారని వార్తలు రాగా, ఆ తరువాత మరికొంత కుదించుకుని జనవరి 31 నుంచే పాఠశాల తెరువనున్నారని వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్రంలోని కరోనా డెల్టా సహా ఒమిక్రాన్ వేరియంట్లు ప్రబలుతున్న పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  ప్రభుత్వ న్యాయవాది అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టిన విచారణకు డీహెచ్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు ప్రస్తావించగా.. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదన్న డీహెచ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను మూడు రోజుల్లో  సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, హైకోర్టు అదేశాల మేరకు ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానంలో జరిగిన విచారణకు హాజరైన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు రాష్ట్రంలోని కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఫీవర్ సర్వే సందర్భంగా 77 లక్షల ఇళ్లను సందర్శించి 3.45 లక్షల ఐసోలేషన్ కిట్‌లను ప్రజలకు అందజేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సానుకూలత రేటు 3.16 శాతంగా ఉందని రావు చెప్పారు. ఐసోలేషన్ కిట్‌లలో పిల్లలకు మందు ఇవ్వడంపై శ్రీనివాస్‌రావును ప్రశ్నించగా, కిట్‌ల ద్వారా నేరుగా పిల్లలకు మందులు అందజేయరాదని, విడిగా ఇవ్వాలని చెప్పారు. అయితే దీనిపై సవివరమైన నివేదికను సమర్పించాలని కోరిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles