తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించినా.. కేసులు మాత్రం తీవ్రస్థాయిలోనే వున్నాయన్నది కాదనలేని వాస్తవమని వార్తులు వినిపిస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్యను కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ చూపిస్తున్న లెక్కలకు.. వాస్తవ పరిస్థితులకు చాలా తేడా వుంది. అయితే సాధారణ జలుబు, దగ్గులతో కూడిన ఫ్లూగానే దీనిని దేశ ప్రజలు భావిస్తూ.. కొందరు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా, మరికొందిరు మాత్రం ఇళ్లవద్ద సంప్రదాయ వైద్యానికి పరిమితం అవుతున్నారు. దీంతో దేశంలోనే ఒమిక్రాన్ కేసులు అత్యల్ప సంక్‌యలోనే నమోదు అవుతున్నాయని కేంద్ర గణంకాలు తెలుపుతున్నాయి.
ఇప్పటికే కొందరు వైద్యులు తమవద్దకు వస్తున్న కేసుల్లో దాదాపుగా 90శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వేనని, అయితే కేవలం 10 శాతం మాత్రమే డెల్టా వేరియంట్ కేసులని స్పష్టం చేస్తున్నారు. అయితే మరికొందరిలో మాత్రం కరోనా సోకినా వారిలో లక్షణాలు ఏమాత్రం కనిపించడం లేదు. అనుమానంతో తీరా పరీక్షా కేంద్రానికి వెళ్లి నమూనా ఇచ్చిన తర్వాత నెగెటివ్ అని ఫలితం చెబుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. దగ్గు, జలుబు, ఒంటి నొప్పుల లక్షణాలతో ఎన్నడూ లేనట్టు ఇబ్బందిగా అనిపించిన వారికి కూడా పరీక్షల్లో పాజిటివ్ రావడం లేదు.
కొన్ని రకాల పరీక్షా విధానాలు, సరైన విధానంలో పరీక్ష చేయకపోవడం, ముక్కు నుంచి ద్రవాన్ని సరిగ్గా సేకరించకపోవడం, రవాణా సమయంలో శాంపిళ్లను సరిగా నిల్వ చేయకపోవడం ఫలితాలను మారుస్తుందని పీడీ హిందుజా హాస్పిటల్ కు చెందిన వైద్యుడు భరేష్ దాదియా చెప్పారు. ‘‘కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లు ఆర్టీపీసీఆర్, ముఖ్యంగా రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో నెగెటివ్ గానే రీడ్ అవుతున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ సెన్సిటివిటీ 50 శాతమే. వైరల్ లోడ్ కూడా తక్కువగా ఉంటోంది. సీటీ వ్యాల్యూ 35 కంటే ఎక్కువ ఉంటే దాన్ని నెగెటివ్ గా పరిగణిస్తారు. వైరల్ లోడ్ తక్కువ ఉన్న వారిలో సీటీ వ్యాల్యూ35 కంటే ఎక్కువ ఉంటోంది. దాంతో ఫలితం నెగెటివ్ అని చూపిస్తోంది’’ అని దాదియా వివరించారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more