Amazon Faces Boycott Call for Selling Products with Tricolor నెట్టింట్లో బాయ్ కాట్‌ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం!

Boycott amazon calls on twitter over products depicting indian flag tricolours

Republic Day 2022, January 26, Amazon, tricolours, #BoycottAmazon, Indian Flag, amazon india news, amazon insult indian, amazon insult indian flag, amazon trolling by indian Amazon faces flak on social media, Patriotism

Ahead of Republic Day, e-commerce giant Amazon is facing the ire of Twitter users for selling various products packaged in the Indian tricolours. The hashtag #Amazon_Insults_National_Flag and calls for Amazon's boycott also began to trend. Twitter users said that items such as chocolates, face masks, ceramic mugs, keychains and kids clothing had the flag’s imprint, which they pointed out is against the Flag Code Of India, 2002.

నెట్టింట్లో బాయ్ కాట్‌ అమెజాన్.. జాతీయ పతాకానికి అవమానం!

Posted: 01/25/2022 07:31 PM IST
Boycott amazon calls on twitter over products depicting indian flag tricolours

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ నిత్యం మన దేశ సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేస్తూనే వుంది. ఒకప్పుడు మన దేవుళ్ల బొమ్మలను దారుణంగా అవమానించిన ఈ సంస్థ.. తాజాగా మన దేశానికి చెందిన 130 కోట్ల మంది భారతీయులను అవమానించే చర్యలకు పూనుకుంది. దేశ గణతంత్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందున యావత్ దేశప్రజలు జాతీయ పండగను జరుపుకునే ఉత్సాహంలో వుండగా, అమాజాన్ సంస్థ మాత్రం మన జాతీయ పతాకాన్ని తీవ్రస్థాయిలో అవమానించింది. రిపబ్లిక్ డేకి ముందు భారత జాతీయ జెండా ముద్రలతో ఉన్న పలు ఉత్పత్తులను తన వెబ్‌సైట్‌లో విక్రయానికి పెట్టింది. ఈ అంశంపై స్పందించిన నెటిజన్లు ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నెట్టింట్లో బాయ్ కాట్ అమోజాన్ (#BoycottAmazon) అనే ట్యాగ్ ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతుంది.

అమెజాన్‌లో భారత జాతీయ పతాకాల ముద్ర ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్న ఫోటోలను ట్విట్టర్‌ వేదికగా షేర్ చేస్తూ అమెజాన్‌ను బాయ్‌కాట్‌ చేయలని కోరుతున్నారు. జాతీయ పతాకం ముద్రతో ఉన్న కమర్షియల్ ఉత్పత్తులను అమ్ముతున్నందుకు అమెజాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అమెజాన్‌పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చాక్లెట్లు, ఫేస్ మాస్క్ లు, సిరామిక్ మగ్స్, కీచైన్, పిల్లల దుస్తులు వంటి ఉత్పత్తులు జెండా ముద్రను కలిగి ఉన్నాయని ట్విట్టర్ వినియోగదారులు తెలిపారు. 2017లో కూడా కెనెడాలోని అమెజాన్ వెబ్‌సైట్‌లో భారత జాతీయ పతాకం ముద్రతో ఉన్న పలు డోర్ మ్యాట్‌లను విక్రయానికి పెట్టింది. అయితే దీన్ని గమనించిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Republic Day 2022  January 26  Amazon  tricolours  #BoycottAmazon  Indian Flag  Patriotism  

Other Articles