Nurse keeps paralytic patient, dance to 'Bullet Bandi' రోగికి డ్యాన్స్‌ స్టెప్‌లతో ఫిజియోథెరఫీ వ్యాయామాలు!

Nurse dances to cheer up paralysis patient during physiotherapy session in viral video

nurse cheers up patient, nurse dance, physiotherapy session, paralysis patient dance, viral video, nurse, video viral, paralytic patient dancing, physiotherapy, physiotherapy video, physiotherapy exercise, paralytic patient, paralytic patient exercise, IPS) officer Dipanshu Kabra, Trending video

A video has gone viral on social media for a very special reason. The video features a nurse trying to cheer up a paralysis patient by making him do physiotherapy exercises while dancing. She made the physiotherapy session a little fun for her patient and the wide smile on his face is proof that he thoroughly enjoyed it. The video was posted on Twitter by Indian Police Service (IPS) officer Dipanshu Kabra.

ITEMVIDEOS: వైరల్ వీడియో: రోగికి డ్యాన్స్‌ స్టెప్‌లతో ఫిజియోథెరఫీ వ్యాయామాలు!

Posted: 01/27/2022 11:40 AM IST
Nurse dances to cheer up paralysis patient during physiotherapy session in viral video

వైద్యో నారాయణో హరి అంటూ వైద్యులను సాక్ష్యాత్తు నారాయణుడితో పోల్చడం మనకు పరిపాటి. ఎంత పెద్దటి అరోగ్య సమస్య వచ్చినా రోగులను ఆ సమస్యల నుంచి సురక్షితంగా కాపాడుగలుగుతారని వారిని ఇలా పోల్చడం సర్వసాధారణం. ఇలపై వెలసిన దేవుళ్లుగా అభిమానిస్తుంటాం. అయితే ఎంతటి పెద్ద స్థాయి రోగం నుంచి అయినా వైద్యుడు చెప్పిన సూచనలను తూచా తప్పకుండా పాటింపజేసే  రోగం త్వరగా నయం అయ్యేలా చేసే నర్సులు, అసుపత్రి సిబ్బందిని మాత్రం ఎవరూ గుర్తుపెట్టుకోరు. వారికి ఎందమంది రోగులతో పరిచయం ఏర్పడినా అది కేవలం అసుపత్రిలో వున్నంత వరకే అయితే.. రోగం నయం అయినా తరువాత వారిని గుర్తుకూడా చేసుకోరు. ఎంతసేపు వైద్యుడి విశిష్టతను చెప్పేవారే తప్ప.. నర్సులు ఇలా చేశారని చెప్పేవారు అరుదు.

అయినా సరే రోగులకు బాధను దూరం చేసి.. వారిని అసుపత్రిలో ఉన్ననాళ్లు కంటికి రెప్పలా కాపాడుకునేవారు మాత్రం నర్సులేనని చెప్పక తప్పదు. ఇలాంటివారికి చిన్న చిరునవ్వు నిస్తే చాలు పోంగిపోతారు. ఓ వైపు అసుపత్రిలో అందరికీ జవాబుదారిగా ఉంటూనే.. మరోవైపు పేషంట్‌ అరోగ్య పర్యవేక్షణలో అనుక్షణం నిమగ్నమయ్యే నర్సులంటే చాలామందిలో చులకన బావం ఎక్కువ. కానీ వారిలో మాత్రం తమకు అప్పగించిన పనిని ఎలాంటి నోప్పి, బాధ తెలియకుండా చేయాలన్నదే వారి తపన. అలా తప్పిస్తూనే.. ఓ రోగితో ఫిజియోథరఫీ చేయించింది ఓ నర్సు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రోటీన్ కు భిన్నంగా పక్షవాతం వచ్చిన రోగిని ఉత్సాహపరిచేందుకు నర్సు డ్యాన్స్‌ చేసింది.  

అసలు విషయంలోకెళ్తే... ఆ వీడియోలో నర్సు పక్షవాత రోగికి వినూత్న పద్ధతిలో కొన్ని ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసేలా సహాయం చేసింది. నర్సు అతనికి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూపుతున్నప్పుడు రోగి మంచం మీద పడుకుని ఉన్నాడు.  అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట కూడా ప్లే అవుతుంటుంది. అయితే పేషంట్‌ నర్సు స్టెప్పులను అనుకరించటానికి ప్రయత్నించాడు. వీడియో చివర్లో ఆమె రోగికి తన చేతులతో  చేతి కదలిక వ్యాయామాలు చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో ఆ పేషంట్‌ ముఖంలో నవ్వు చిగురించడమే కాకుండా తను కూడా ఉత్సాహంగా డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తూ తనకు తెలియకుండానే చచ్చుబడిన అవయవాలను కదిపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఫిజియోథెరపీ సెషన్‌లో రోగికి సహాయం చేస్తున్న నర్సును ఆయన ప్రశంసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles