ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ వేళ.. గుడివాడలోని రాష్ట్ర మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ హాలులో క్యాసినో నిర్వహించారన్న వార్తలతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నేతలు నిజనిర్థారణ కమిటీతో సదరు ప్రాంతంలో పర్యటించేందుకు రాగా, ఇక తాజాగా బీజేపి నేతలు గుడివాడ ప్రాంతంలో పర్యటించి సత్యాన్వేషణ చేసేందుకు బయలుదేరారు. కేసినో నిర్వహించడం, అమ్మాయిలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడం వంటి ఘటనలను నిరసిస్తూ బీజేపీ నేతలు విజయవాడ నుంచి గుడివాడకు పాదయాత్రగా బయల్దేరారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేతృత్వంలో బీజేపి నేతలు సత్యాన్వేషణకు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
నందమూరు వద్ద వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే సోము వీర్రాజు సహా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తదితర నేతలను కృష్ణా జిల్లా పోలీసులు నందమూరు వద్ద అడ్డుకోగా, వారు వాహనాలు దిగి కాలినడకన గుడివాడకు బయలుదేరారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని బీజేపి నేతలు ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం నడిచారు, కాగా, బీజేపీ నేతలను పోలీసులు కలవపాముల వద్ద మరోసారి అడ్డుకున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేతలను అడ్డుకునేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి ఉంగుటూరుకు తరలించారు.
దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో శాంతిభద్రతలను కారణంగా చూపుతూ తమను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు తమను అడ్డుకోవడమేంటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ అరెస్టులను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర నేతలు సంక్రాంతి వేడుకల కోసం గుడివాడకు వెళ్తుండగా వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ అన్నారు. రాష్ట్రంలోని కొందరు ఐపీఎస్ అధికారులు వైపీఎస్ (వైసీపీ పోలీస్ సర్వీస్) అధికారుల మాదిరి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ బేబీ పౌడర్ జాన్సన్ & జాన్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు... Read more
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more