ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు హామీలను ఇవ్వడం, పలు వాగ్దానాలు చేయడం పరిపాటే. అయితే ఈ సమయంలో ఫలానా ఉచితం అంటూ చేసే వాగ్ధానాలు ఇవ్వడం అత్యంత తీవ్రమైన సమస్యగా దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పలానా ఉచితంగా అందిస్తామంటూ కూడా కొన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చడం రాజ్యంగ విరుద్దమని, ఉచిత హామీలను ఇచ్చే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పేర్కోంటూ సుప్రీంకోర్టు న్యాయవాది అవ్వినీ ఉపాధ్యయ దాఖలు చేసిన పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎ,ఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ పిటీషన్ ను విచారిస్తున్న సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం ఇవాళ సీరియస్ అయ్యింది. సాధారణ బడ్జెట్ తో పోలిస్తే రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీల బడ్జెట్టే ఎక్కువైపోతోందని అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్ధానాలపై మార్గదర్శకాలను రూపొందించాలని తమ నోటీసుల్లో సుప్రీం పేర్కొన్నది. రెగ్యులర్ బడ్జెట్ కన్నా.. ఉచిత బడ్జెట్ హద్దులు దాటుతోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. తాము జారీ చేసిన నోటీసులపై నాలుగు వారాల్లోగా అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. ఉచిత హామీల వల్ల ఎన్నికలు ప్రభావితమవడమే కాకుండా, ఎన్నికల్లో పారదర్శకత కూడా లోపిస్తోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు.
ఉచిత వాగ్ధానాల అంశంపై గైడ్‌లైన్స్‌ను రూపొందించాలని ఇప్పటికే ఈసీని కోరినట్లు సీజే తెలిపారు. ‘‘ఇంతకుముందు ఇదే విషయానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చాం. దానిపై ఒకేఒక్కసారి ఈసీ సమావేశమైంది. రాజకీయ పార్టీల అభిప్రాయం అడిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో.. దాని ఫలితమేంటో కూడా నాకు తెలియదు’’ అని అన్నారు. ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడంపై 2013లోనే సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఉచిత వాగ్ధానాలు ఇచ్చి నేరవేర్చని పార్టీల గుర్తులను సీజ్ చేయాలని, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని పిల్లో కోరారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more