రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు ఇప్పటికే హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనే పాజిటివిటీ రేటు 10 శాతం మించలేదని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనం గుమికూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు విధించామన్నారు.
పాజిటివిటీ రేటు మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం ఉండగా, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం ఉందని వెల్లడించారు. ఇక జీహెచ్‌ఎంసీలో 4.26 శాతం, మేడ్చల్‌లో 4.22 శాతంగా ఉందన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ పడల ఆక్యుపెన్సీ 6.1 శాతంగా ఉందని చెప్పారు. వారం రోజులుగా రోజుకు లక్షకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే జరుగుతొందని, మూడు రోజుల్లోనే 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామన్నారు. 15 నుంచి 18 ఏండ్లలోపువారిలో 59 శాతం మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని వెల్లడించారు. ఇదిలావుండగా తెలంగాణలో కోవిడ్ ఆంక్షల అమలుపై తెలంగాణ హైకోర్టు పలు సూచనలు చేసింది.
కోవిడ్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటీషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ ప్రభుత్వానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ ప్రకారం, కోవిడ్ నిబంధనలు పాటించని వారి నుంచి జరిమానాలు వసూళ్ల చేయడం లేదని పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం.. మాస్క్‌లు ధరించని, సామాజిక దూరం పాటించకుండా ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని ఆయన రాష్ట్ర పోలీసులు, జిహెచ్‌ఎంసిని ఆదేశించారు. ఇక ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావును ఈ నెల 28 తమ ఎదుట హాజరు కావాలని ఆయన అదేశించారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more