ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పీఆర్సీ అర్థాన్ని మార్చివేసి జీవోలను తీసుకువచ్చి.. రాష్ట్ర అభివృద్దిలో అహర్నిశలు కష్టపడుతున్న ఉద్యోగుల కడుపు కోట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పీఆర్సీ వచ్చిందంటే వేతనాలు పెరుగుతాయని, కానీ వైఎస్సార్ సిపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీతో తమ వేతనాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని ఉద్యోగులు విమర్శల పర్వానికి కూడా దిగిన విషయం తెలిసిందే. దీంతో ఉధ్యోగ, ఉపాధ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందోళనలు నిర్వహిస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఉద్యోగులు ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానం పంపింది. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్లబోమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోల రద్దుతో పాటు మిశ్రా కమిటీ నివేదికకు బహిర్గతం చేయాలని, పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని, అలా అయితేనే చర్చలకు వెళ్తామని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఉద్యోగులు నూరు శాతం ప్రభుత్వంలో భాగమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో అటు హైకోర్టులోనూ ఉద్యోగ సంఘాలకు ఎదురుదెబ్బ తగిలింది.
కాగా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాలు కలిపి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు ఇప్పటికే ఉద్యోగులు చెప్పారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని జిల్లాల కేంద్రాల్లో ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. విజయవాడ పాత బస్టాండ్ నుంచి ధర్నా చౌక్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని అంటున్నారు. ఈ జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. ఇప్పటికే తాము నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని తెలిపారు. నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గి తమ గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more