పెళ్లి అనగానే ముందుగా గుర్తు వచ్చేది డీజే సౌండ్లు, డ్యాన్స్‌లు.. ఆ వివాహ వేడుకంతా ఉత్సాహంగా సాగిపోవాలని వధూవరులు ఇద్దరూ కోరుకుంటారు. ఓ తీపి గుర్తుగా ఉండిపోయేలా వివాహ వేడుకను నిర్వహించుకుంటారు. కానీ ఇక్కడ ఇందుకు విరుద్ధంగా జరిగింది. పెళ్లి మండపంలో డ్యాన్స్ చేసిన వధువును వరుడు ఆమె చెంపపై లాగి కొట్టాడు. దీంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వరుడికి వధువు దిమ్మతిరిగే షాకిచ్చింది. ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే మరొకరితో ఆమె వివాహం చేసుకుంది.
తమిళనాడు కడలూరు జిల్లాలోని పన్రూటి గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కుమార్తెతో ఓ యువకుడికి జనవరి 20న పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే జనవరి 19న పన్రూటికి సమీపంలోని ఓ ప్రయివేటు వెడ్డింగ్ హాల్లో రిసెప్షన్ నిర్వహించారు. వెడ్డింగ్ హాల్‌కు చేరుకున్న నవ వధువు తన బంధువులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చేయడం వరుడికి నచ్చలేదు. అందరూ చూస్తుండగానే వధువు చెంపపై వరుడు లాగి కొట్టాడు. దీంతో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తండ్రికి కూతురు తెగేసి చెప్పింది. తండ్రి కూడా అంగీకరించాడు. ఆ తర్వాత ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే తమ సమీప బంధువుతో ఆ అమ్మాయికి వివాహం జరిపించారు.
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more