వర్షం పడుతున్న సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే మనం ఒకటి రెండు సార్లు అలోచిస్తాం. ఎందుకంటే ప్రతీ రోజు వెళ్లే రోడ్డే అయినా.. ఎక్కడ గొతులు పడ్డాయో.. ఎక్కడ నీళ్ల కింద గోతులు వున్నాయో తెలియక ప్రమాదాల బారిన పతడామో అన్ని ఆందోళన కూడా కారణం కావచ్చు. అయితే వర్షం బదులుగా మంచు తుఫాను కురిసే ప్రాంతాల్లో పరిస్థితి ఏలా ఉంటుందో.. ఎందుకంటే కనీసం నీళ్లు ప్రవాహం, సుడులు తిరగడంతో కాస్తా కూస్తో రోడ్డును అంచనా వేసుకుంటూ వెళ్లవచ్చు. కానీ మంచు తుపాను పడితే మంచు కింద గోయ్యి వుందో రోడ్డు వుందో కూడా తెలియదు. మంచు తుఫాను సమయంలో బయటికి వెళ్లాలనే ఆలోచన చాలా మందిని భయపెడుతుంది.
కానీ కెనడాలో ఒక వ్యక్తి మాత్రం మంచు తుపాను కురుస్తున్నా.. లెక్కచేయకుండా బయటకు వెళ్లాడు. అతని అలాంటి కష్టం వచ్చింది. మంచు తుపాను కూడా లెక్కచేయలేని అంత కష్టం ఏమిటా అంటే.. భరించలేని క్షుద్భాదే. ఆకలితో నకనకలాడుతున్న కడుపును కాస్తా కష్టమైనా నింపుకోవాలని భావించాడు. వరసగా గత వారం నుంచి కురుస్తున్న మంచుతుపానుతో ఇంట్లోని సరుకులు నిండుకున్నాయో.. లేక మరేంటో కారణం తెలియాదు కానీ.. ఇంట్లో వంట చేసుకోలేక.. తనకు ఇష్టమైన రెస్టారెంట్‌కు వెళ్లడానికి పెద్ద సాహసయాత్రనే చేపట్టాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరోటి తలచిందన్నట్లు.. అతడు చేసిన సాహనంతో నెటిజనులకు చేరువయ్యాడు. మంచుతుపానులో నడివడంతోనే అతని వీడియో వైరల్ అయ్యిందా.. అని ప్రశ్నిస్తున్నారు కదూ.
కాదండీ.. ఎంతో ఆకలి వేయడంతో అతను స్థానికంగా వుంటే రెస్టారెంటుకు చేరుకున్నాడు. మంచు తుపానులో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి.. ఇక ఆకలి బాధనైనా తీర్చుకుందామనుకుని రాగా, రెస్టారెంట్ మూసివేసి ఉంది. దీంతో ఇంత సాహసం చేసి వచ్చినా.. దేవుడు తనకు అకలి బాధను మాత్రం తీర్చే మార్గాన్ని చూపించలేదన్నట్లు.. రెస్టారెంట్ కు తాళం వేసివుండటం చూసి గుండె పగిలినంత పనైంది. దీంతో ఒక్కసారిగా తన మోకాళ్లపై కూలబడిపోయాడు. ఇక చేసేది లేక కొద్ది సేపటికి లేచి తన ఆకలి బాధ ఎలా తీరేనో అనుకుంటూ వెనుదిరిగాడు. ఈ క్రమంలో అతడు నిరాశకు గురై తిరుగివెళ్తున్న క్రమంలో తనను తాను బాల్సెన్స్ చేసుకోవడం కూడా కష్టంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ నెట్టంట్ల వైరల్ అయ్యింది.
ఈ వీడియోను పరిశీలించిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఈ ఫూటేజీని నెట్టింట్లో అప్ లోడ్ చేసింది. అంతేకాదు నిరాశగా వెనుదిరిగి వెళ్లిన కస్లమర్ కు రెస్టారెంట్ ఉచిత భోజనం ఇవ్వాలని నిర్ణయించింది. మంచు తుపాను కారణంగా ఫుడ్ డెలివరీ సేవలు గంటల తరబడి మూసివేయబడినందున, స్కార్‌బరోలో ఆకలితో ఉన్న కస్టమర్ ఏదో విధంగా మంచుతో కూడిన వీధిలోంచి నైసీస్ తినుబండారానికి వెళ్లాడు. కరేబియన్ రెస్టారెంట్ షేర్ చేసిన సిసీటీవీ ఫుటేజీలో.. రెస్టారెంట్ వద్దకు చేరుకున్న కస్టమర్.. అది మూతవేయడం చూసి నిరుత్సాహానికి గురైన వ్యక్తి మోకాళ్లపై పడిపోయాడు. దీంతో అతని ఆకలి బాధను అర్థం చేసుకున్న నెటిజనుల నుంచి సానుభూతి విపరీతంగా వ్యక్తమైంది.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
May 25 | జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ పటియాలా హౌజ్ ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతోపాటు రూ.10లక్షల జరిమానా... Read more
May 25 | తన కుటుంబం ఒక చిన్న ఇళ్లు కొనుక్కోవాలని అనుకుంది. అయితే తాముండే గ్రామంలో కాకుండా జిల్లా కేంద్రంలో అంటే లక్షల రూపాయల వ్యవహారం. ఐతే లక్షలు కావాలంటే ఎవరు మాత్రం ఇస్తారు. వ్యాపారం చేస్తామంటే... Read more
May 25 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై న్యాయస్థానం అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అక్కడ చిత్రాలను రూపోందించిన దర్శకుడిగా పాపులారిటీని సంపాదించిన ఆయన..... Read more
May 25 | ఆవేశం, కంగారు, తొందరపాటు మనల్ని ఊబిలోకి నెట్టివేస్తాయి. వీటి ప్రభావంతో ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులు.. చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. అందుకనే పెద్దలు అంటారుగా తన కోపమే తన శత్రువు,... Read more
May 25 | ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలుదేశాలలో ప్రభావం చూపుతున్న కరోన మహమ్మారి.. భారతదేశంలోనూ అధికారికంగా ఐదు లక్షలమందికిపైగా పోట్టనపెట్టుకుంది. అయితే అల్పా, డెల్టా వేరియంట్లు నేరుగా పేషంట్ల శ్వాసకోశలపై ప్రభావాన్ని చూపగా, ఆతరువాత తీవ్ర లక్షణాలు లేనిది... Read more