Builders cannot sell dream and not fulfil it: SC డ్రీమ్ ఫ్లాట్ చూపించి.. ఉత్తుత్తి ఫ్లాట్ ఇస్తామంటే కుదరదు

Concerned about middle class home buyers sc urges centre to consider framing model builder buyer agreement

supreme court, model flat, builder, buyer, RERA homebuyers, Supreme Court, Supertech builders, justice dy chandrachud, justice bela. m. trivedi, Gaurav Agarwal, crime

The Supreme Court on Friday ordered the real estate firm Supertech to process the refund to homebuyers, who have been affected due to the demolition of its two 40-story towers in Noida. A bench comprising Justices DY Chandrachud and Bela. M. Trivedi said Supertech should do the complete refund to homebuyers, who filed the contempt petition, by February 28, and the other homebuyers who are not in court should approach it within a week.

డ్రీమ్ ఫ్లాట్ చూపించి.. ఉత్తుత్తి ఫ్లాట్ ఇస్తామంటే కుదరదన్న సుప్రీం

Posted: 01/22/2022 04:31 PM IST
Concerned about middle class home buyers sc urges centre to consider framing model builder buyer agreement

ముందు మోడల్ ఫ్లాట్ (అన్ని వసతులతో  సుందరంగా తీర్చిదిద్దిన నమూనా ఫ్లాట్) చూపించి.. కొనుగోలుదారులను ఆకర్షించి.. తీరా ప్లాట్ లను అప్పగించే సమయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటం సహజం. అదేంటి ముందుగా చూపించిన నమూన ఫ్లాట్ వేరుగా ఉంది.. ఇప్పుడు అప్పగించే ప్లాట్ వేరే మాదిరిగా వుంది. ఇదేంటని నిలదీశారనుకోండి.. అచ్చంగా నమూనా ప్లాట్ మాదిరిగా తీర్చిదిద్ది ఇవ్వాలంటూ అందుకు అదనపు ఖర్చు అవుతుందని, అది భరించేందుకు మీరు సమ్మతించి పేమేంట్ చేస్తే.. మోడల్ ఫ్లాట్ తరహాలోనే మీ ప్లాట్ ను కూడా తీర్చిదిద్దుతాం అని అపార్టుమెంట్ బిల్డర్లు చెప్పడం పరిపాటిగా మారింది. అదే విషయం ముందు చెబితే అమ్ముడుపోవని అలాంటి ట్రిక్స్ పాటిస్తుంటారు.

ఇది అపార్టుమెంట్ల విక్రయాలకు, అందులో లాభాలను గణంగా అందుకునేందుకు ఇదోక ట్రిక్. ఇటువంటి ఒక కేసులో బిల్డర్ కు దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలంటింది. కలల (డ్రీమ్) ఫ్లాట్ చూపించి వసూలు చేసిన మొత్తాన్ని కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. గురుగ్రామ్ లో నిర్మాణ సంస్థ ఐరియో ప్రైవేటు లిమిటెడ్ ‘స్కైఆన్’ ప్రాజెక్టు చేపట్టింది. నమూనా ఫ్లాట్ లో ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్ చూపించింది. ఫ్లాట్ నుంచి చూస్తే గోల్ఫ్ కోర్సు కనిపిస్తుందని (గోల్ఫ్ కోర్స్ వ్యూ) బ్రోచర్ రూపొందించింది. దీన్ని చూసి కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ.2 కోట్లకు పైనే వసూలు చేసింది.  

కానీ, చివరికి హామీ ఇచ్చిన వసతుల్లో కొన్నే ఉన్నాయి. దీంతో  కొనుగోలుదారులు కొందరు తమ పెట్టుబడి మొత్తాన్ని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. 20 శాతం మినహాయించుకుని ఇస్తామని ఐరియో సంస్థ తెలిపింది. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను కొనుగోలుదారులు ఆశ్రయించారు. అసలు పెట్టుబడిని, తీసుకున్న నాటి నుంచి 10.5 శాతం వడ్డీని రెరా చట్టం కింద చెల్లించాలని ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ‘‘కలల ఫ్లాట్ చూపించి, హామీ మేరకు వసతులను సమకూర్చలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు కొనుగోలు దారులు తమ పెట్టుబడిని, వడ్డీ సహా తిరిగి పొందేందుకు అర్హులు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles