Election Commission issues rate chart for Uttar Prades polls ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రేట్ కార్డు జారి చేసిన ఈసీ

Samosa at rs 6 bmw merc at rs 21 000 day ec issues rate chart for up polls

rate card, Tea, samosa, garland, drum beater District Election Officer, Lucknow, UP elections 2022, UP assembly elections, mercedes, fortuner, eci, bwm, mercedes

To provide equal level playing field to all candidates across the party line for state assembly election, the district election officer (DEO) Lucknow issued the rate chart for services and items a candidate could spend in election campaigns.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రేట్ కార్డు జారి చేసిన ఈసీ

Posted: 01/19/2022 05:07 PM IST
Samosa at rs 6 bmw merc at rs 21 000 day ec issues rate chart for up polls

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ధరల పట్టికను లక్నో జిల్లా ఎలక్షన్ అధికారి విడుదల చేశారు. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఒకే విధమైన రేట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు రేట్ కార్డులను విడుదల చేశారు. దీంతో ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి తన రేట్ కార్డు ప్రకారం వ్యయాల పట్టికను ఎన్నికలఅధికారులకు సమర్పించాల్సి వుంటుంది. చిన్నా, పెద్ద పార్టీలతో పాటు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా ఈ ధరల పట్టిక మేరకే తమ వ్యయాల పట్టికను సమర్పించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.

ఇక ధరల విషయానికి వస్తే ఒక కప్పు టీ రూ.6, ఒక సమోసా రూ.6గా ఈసీ నిర్ణయించింది. అలాగే, నాలుగు పూరీలు, ఒక స్వీట్ తో కూడిన బ్రేక్ ఫాస్ట్ ధరను రూ.37గా ఖరారు చేసింది. మామూలుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడం తెలిసిందే. ఈ ఖర్చుకు పరిమితి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.40 లక్షలకు మించి ఖర్చు పెట్టడానికి లేదు. పోటీ చేసే అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులు వారి గెలుపు, ఓటములను ప్రభావితం చేయరాదన్నది ఈ నిబంధన ఉద్దేశ్యం.

ఎంఆర్పీ ధరపై మినరల్ వాటర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. మెడలో వేసే పూలదండకు రూ.16, ముగ్గురు డ్రమ్ములు వాయించే వారికి రోజుకు రూ.1,575 ఇచ్చుకోవచ్చు. కార్లను అద్దెకు తీసుకుంటే.. బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ అయితే నిత్యం రూ.21,000, పజెరో స్పోర్ట్ కు రూ.12,600, ఇన్నోవా, ఫార్చ్యూనర్, క్వాలిస్ కు రూ.2,310 చొప్పున రోజువారీ ఖర్చు పెట్టుకోవచ్చు. అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాలి. అందులో ఈసీ నిర్ణయించిన రేట్లను ప్రామాణికంగా తీసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles