Omicron causing hospitalizations and deaths: WHO chief ఒమిక్రాన్ ప్రమాదకారి.. తేలిగ్గా తీసుకోవద్దు: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Omicron is dangerous deaths of new variant may increase warns who director

Dr Tedros Adhanomfour, concern, new variant, Omicron Variant, preading vigourously, delta variant, corona vaccine, omicron, WHO, Omicron, WHO report on Omicron, WHO latest report on Omicron, Covid, Covid Omicron, WHO latest report, omicron latest news, omicron updates

The World Health Organization’s (WHO) Director-General, Tedros Adhanom Ghebreyesus, said that the Omicron variant of the coronavirus should not be dismissed as “mild” and that it is killing people around the world. Tedros added that while Omicron is less severe than the Delta variant on fully vaccinated people, the surge in infections is putting pressure on the healthcare worldwide.

ఒమిక్రాన్ మరణాలు పెరగొచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Posted: 01/20/2022 10:31 AM IST
Omicron is dangerous deaths of new variant may increase warns who director

 ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తిని అనేక దేశాలు సాధారణంగా తీసుకుంటున్నాయని, అయితే ఇది తేలిగ్గా తీసుకోవాల్సిన వేరియంట్ కాదని, ప్రాణాంతక వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా స్పష్టం చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో ముగిసిపోద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌పంచ దేశాధినేత‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయ‌న్న ఆపోహ‌ల‌ను వీడాల‌న్నారు. కరోనా టీకా తీసుకోని వారికి దానితో ముప్పు ఎక్కువని ఆయన హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా ప్రభావం తగ్గిపోతోందని, డెల్టాను ఒమిక్రాన్ అధిగమించేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కవారంలోనే కోటిన్నర కేసులు నమోదయ్యాయన్నారు.

రికార్డు స్థాయిలో యూరోప్ దేశాల్లో కేసులు న‌మోదు అవుతున్న దృష్ట్యా.. టెడ్రోస్ మ‌రోసారి వార్నింగ్ జారీ చేశారు. మంగ‌ళ‌వారం ఒక్క రోజే ఫ్రాన్స్‌లో సుమారు 5 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ఇక బుధ‌వారం తొలిసారి జ‌ర్మ‌నీలో ఏకంగా ల‌క్ష పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. ఒమిక్రాన్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా సుమారు రెండు కోట్ల పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు డెడ్రోస్ తెలిపారు. ఒమిక్రాన్‌తో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలే క‌లుగుతాయ‌న్న త‌ప్పుడు వార్త‌ల‌తో.. ఆ వేరియంట్ వ్యాప్తి మ‌రింత వేగం పుంజుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఎవ‌రూ త‌ప్పు చేయ‌వ‌ద్దు అని, ఒమిక్రాన్ వ‌ల్ల హాస్పిట‌ల్‌లో చేరుతున్న‌వారి సంఖ్య‌, మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంద‌న్నారు.

ఒమిక్రాన్ దూసుకెళ్తున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని, దాని వ‌ల్ల కొత్త వేరియంట్లు పుట్టుకువ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అందుకే వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయాల‌ని టెడ్రోస్ ప్ర‌పంచ దేశాల‌కు వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సినేష‌న్ వేగంగా లేని దేశాలు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు చెప్పారు. అతివేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల హాస్పిట‌ళ్ల‌లో చేరుతున్న వారి సంఖ్య‌, మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీస్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ మైక్ ర్యాన్ తెలిపారు. కేసులు పెరిగితే ఇప్పుడున్న ఆరోగ్య సిబ్బందిపై పనిభారం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. దాని వల్ల ప్రతి నలుగురిలో ఓ వైద్యసిబ్బంది మానసిక ఆందోళనలకు లోనవుతున్నట్టు ఇటీవలి ఓ స్టడీ పేర్కొందని గుర్తు చేశారు. కేసులు పెరిగితే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదమూ ఉంటుందని, అది ఒమిక్రాన్ కన్నా ఇంకా ప్రమాదకరంగా పరిణమించే ముప్పుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles