Rahul Gandhi attacks PM Modi over China's Illegal bridge చైనా వంతెనను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని భయంగా ఉంది: రాహుల్

Afraid pm might inaugurate this rahul gandhi on china s illegal bridge

Pangong Tso Lake, China Bridge, PM Modi, Rahul Gandhi, Narendra Modi, Prime Minister, Ladakh, LAC, China Bridge Inauguration, PM Modi Silence, India, China

Rahul Gandhi took a swipe at PM Modi, this time over reports of China constructing a bridge on the Pangong Tso Lake in Ladakh near the Line of Actual Control (LAC). The former Congress chief had questioned the Prime Minister's silence on the same on January 4 as well. This time he tagged a picture with arrows showing the alleged Chinese bridge on Pangong Tso Lake, which is extremely close to the LAC.

చైనా వంతెనను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని భయంగా ఉంది: రాహుల్

Posted: 01/19/2022 04:11 PM IST
Afraid pm might inaugurate this rahul gandhi on china s illegal bridge

దేశానికి సంబంధించిన అన్ని అంశాలపై ఆలస్యం లేకుండా స్పందించే ప్రధాని నరేంద్రమోడీ గత కొంతకాలంగా కొనసాగుతున్న చైనా అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. చైనా మన దేశ వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో వంతెన నిర్మిస్తుంటే ప్రధాని మోదీ మౌనం వహించడం దేశానికి శాఫంగా మారనుందని ఆయన దుయ్యబట్టారు. పాకిస్థాన్ విషయంలో సర్జికల్ స్ట్రైక్స్ తో విరుచుకుపడిన ప్రధాని.. చైనా విషయంలో ఎందుకు తాత్సార ధోరణి అవలంభిస్తున్నారని నిలదీశారు. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా పట్టు కోసం పాంగాంగ్‌ సరస్సు మీదుగా అక్రమంగా ఒక వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మౌనం వహించడంతో చైనా బలగాలు పాంగాంగ్ సరస్సుపై నిర్మిస్తున్న వంతెనను రెట్టించిన ఉత్సహాంతో పూర్తైయ్యేలా చేస్తున్నాయి కాబోలు అంటూ రాహుల్‌ గాంధీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే మోదీ ఈ వంతెనను ప్రారంభించేందుకు రారేమోనని భయం వేస్తుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. పాంగాంగ్‌ సరస్సు మీదుగా నిర్మిస్తున్న వంతెన గనుక పూర్తైయితే చైనీస్‌ దళాలు సరస్సు ఒడ్డుకు త్వరగా చేరుకోవడమే గాక మిలటరీ పరంగా పట్టు సాధించగలరని తెలిసి కూడా మోదీ ప్రభుత్వ ఏం పట్టనట్టు చూస్తుందని విమర్శించారు. దేశభధ్రతకు ఈ వంతెనతో ముప్పు పొంచివున్నా.. ప్రధాని మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

పైగా మోదీ ప్రభుత్వం చైనాతో తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉ‍న్న వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైందని, అందువల్లే భారత్‌- చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగాయని అన్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారత్‌కు చైనాతో సరిహద్దు వివాదం ఉందని.. పైగా అక్కడ కూడా భారత సైన్యం మోహరించని ప్రదేశాలను ఆక్రమించుకుని ఇలాంటి వంతెనలనే చైనా నిర్మించిందని అన్నారు. చైనా అక్రమ వంతెన నిర్మాణానికి సంబంధించిన వీడియోతోపాటు "మోదీ ఈ వంతెన ప్రారంభిస్తారేమో" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles