SC intervenes in hate speeches against Muslims విద్వేష ప్రసంగాలపై కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..

Haridwar hate speeches supreme court seeks uttarakhand reply in 10 days

Dharam Sansad, Haridwar hate speech case, Dharma Sansad, Supreme Court, Patna High Court, Delhi Police, Justice Anjana Prakash, journalist Qurban Ali, Uttarakhand government, Central government, Uttarakhand, Politics

The Uttarakhand government, central government and Delhi Police have been ordered by the Supreme Court to reply to a petition on the "Dharma Sansad" or religious assembly hate speech case within 10 days. The court was hearing a petition by former judge of Patna High Court Justice Anjana Prakash and journalist Qurban Ali.

విద్వేష ప్రసంగాలపై కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..

Posted: 01/12/2022 04:44 PM IST
Haridwar hate speeches supreme court seeks uttarakhand reply in 10 days

ఢిల్లీ వేదికగా గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన ‘ధ‌ర్మ సంస‌ద్’ స‌మావేశంలో విద్వేష ప్ర‌సంగాలు చేసిన అంశంపై ఇవాళ విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. మతవాద కార్యక్రమాలను నిర్వహించి.. వాటి వేదికగా ఇతర వర్గాలకు చెందిన మైనారిటీ ప్రజలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంతో ఈ ఘటనపై పది రోజుల లోపు సమాధానం ఇవ్వాలని అదేశించింది. పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అంజనా ప్రకాశ్‌, జర్నలిస్టు ఖుర్బాన్‌ అలీ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

డిసెంబర్ 17 నుంచి 19 వరకు హిందూ యువవాహిని, హరిద్వార్ లో మతగురువు యతి నర్సింహానంద్ నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో ద్వేషపూరిత ప్రస్ంగాలు చేశారని పిటీషన్ దారులు వేర్వురుగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో జాతీ ప్రక్షాళన చేయడానికి ముస్లింలపై మారణహోమం చేయడానికి బహిరంగంగా పిలుపునివ్వడం అక్షేఫనీయమని పిటీషనర్లు పేర్కోన్నారు. హ‌రిద్వార్‌లో గ‌త ఏడాది జ‌రిగిన ధ‌ర్మ సంస‌ద్ కార్య‌క్ర‌మంలో..  ముస్లింలకు వ్యతిరేకంగా అసరమైతే ఆయుధాలను కూడా వాడేందుకు వెనకాడరాదని హిందూ నేత‌లు వివాదాస్ప‌ద ప్ర‌సంగాలు చేశారు. దీనికి తోడు ఆ ప్రసంగాల తాలుకు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని,

దీంతో వీళ్లు కూడా మా పక్షం అంటూ మరో వీడియో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కోట్టిందని, అందులో ఓ పోలీసు అధికారి నవ్వుతూ కనిస్తున్నారని పిటీషనర్లు పేర్కోన్నారు. ఢిల్లీలో జరిగిన హిందూ సంసద్ సభావేదికగా.. ఓ వర్గానికి చెందినవారిపై అవసరమైతే ఆయుధాలను కూడా వినియోగించాలని బహిరంగంగా పిలుపునిచ్చినా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు వారిపై చర్యలు చేపట్టలేదని పిటీషనర్లు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఇదే తరహాలో ఈ నెల 23న ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగడ్ లో జరగనున్న మరో ధర్మ సంసద్ సభను నిలిపివేయాలని స్థానిక అధికారులను సంప్రదించాలని అత్యున్నత న్యాయస్థానం పిటీషనర్లకు సూచించింది.

తరువాత ఓ పోలీసు అధికారి నవ్వుతూ కనిపించడంతోముస్లింల‌ను టార్గెట్ చేయాల‌న్న అభిప్రాయాల్ని వినిపించారు. ఈ కేసులో దాఖ‌లైన పిటిష‌న్‌ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం త్రిసభ్య బెంచ్ విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జస్టిస్ సూర్య కాంత్‌, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధ‌ర్మాసనం ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టింది. పిటిష‌న‌ర్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ వాదించారు. ధ‌ర్మ సంస‌ద్ కార్య‌క్ర‌మాల‌ల్లో విధ్వేషపూరిత ప్రసంగాలను నేతలు యధేశ్చగా చేస్తున్నా.. వారిపై ఎలాంటి చర్యలను పోలీసులు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు, ఇదే కొనసాగితే దేశంలో అస్తవ్యస్థ వాతావారణం నెలకొంటుందని అందోళన వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles