Saina Nehwal responds to Siddharth's apology సిద్ధార్థ్ క్షమాపణలపై స్పందించిన సైనా.. హీరోపై పోలీసు కేసు..

Actor siddharth apologises to saina nehwal for rude joke on twitter

Siddharth, Saina Nehwal, Parupalli Kashyap, Saina Nehwal vs Siddharth, Siddharth on Saina Nehwal, Twitter, Siddharth tweet on Saina Nehwal, Siddharth viral tweet, Siddharth post on Saina, Rang De Basanti, Rang De Basanti actor, Siddharth Twitter account, Siddharth tweet, Siddharth says sorry, PM Security breach, twitter, apology, Hyderbad police case, Tamil Actor, crime

Saina Nehwal said on the sidelines of the ongoing India Open in Delhi, "He only said it and he is now apologising. I was surprised to see myself trending on Twitter that day. I haven’t spoken to him but I am happy that he apologised." She added, "See, it is about women, he shouldn’t target a woman like that but it’s okay, I am not bothered about it, I am happy in my space and god bless him."

సిద్ధార్థ్ క్షమాపణలపై స్పందించిన సైనా.. హీరోపై పోలీసు కేసు..

Posted: 01/12/2022 05:35 PM IST
Actor siddharth apologises to saina nehwal for rude joke on twitter

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు ప్రముఖ హీరో సిద్ధార్థ్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లో పర్యటించిన సందర్భంలో ఎదురైన భద్రతా లోపంపై సైనా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్‌పై సిద్ధార్థ స్పందిస్తూ చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. దీంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సందర్భంలో ట్వీట్‌పై వివరణ ఇచ్చాడు. తానో అసభ్యకరమైన జోక్ చేశానని, అందుకు క్షమించాలని వేడుకున్నాడు. మీ ట్వీట్‌కు తాను స్పందించిన తీరు, వాడిన భాష సరికాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను ఎవరినీ కించపరచలేదని, తన ట్వీట్‌లో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూనే సైనాకు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశాడు.

సైనా ట్వీట్‌పై తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమేనని వివరణ ఇచ్చాడు. అయితే, తాను పెట్టిన కామెంట్ చాలా మందిని బాధించిందని, మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశం తనది కాదంటూ వివరణ ఇచ్చాడు. సైనా నెహ్వాల్ ఎప్పుడు ఒక గొప్ప క్రీడాకారిణి అని.. తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అంతేకాదు తాను పెట్టిన పోస్టు చాలా మందిని బాధపెట్టిందని.. కనుక అలాంటి తాను పోస్ట్ చేసిన కామెంట్స్‌పై క్షమాపణ కోరున్నాననంటూ ట్వీట్‌ చేశాడు. హీరో సిద్దార్థ్ పెట్టిన కామెంట్లపై జాతీయ మహిళా కమీషన్ కూడా కన్నెర్ర చేసింది. ఈ నేపథ్యంలో తన ట్వీట్ ను డిలీట్ చేసిన సిద్దార్థ్.. సైనా నెహ్వాల్ కు బేషరుతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

అయితే భార‌త బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై సిద్దార్థ్ క్షమాపణలపై స్పందించింది. సిధ్దార్థే తొలుత నా గురించి పలు కామెంట్లు చేశాడు. నేను చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అనంతరం ఆయనే ఒక మొట్టు దిగి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అత‌డు చేసిన వ్యాఖ్య‌లు అంత‌గా ఎందుకు వైర‌ల్ అయ్యాయో నాకు తెలియ‌దు. ట్విట్ట‌ర్‌లో నా పేరు ట్రెండ్ అవుతుండ‌డం చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయాను.. సిద్ధార్థ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పినందుకు సంతోషం. ఓ మ‌హిళ‌ను ఈ విధంగా లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు. జ‌రిగిందేదో జ‌రిగింది... నేను దీని గురించి బాధ ప‌డ‌ట్లేదు.. సంతోషంగానే ఉన్నాను.. అత‌డికి దేవుడు తోడుగా నిలుచుగాక' అంటూ సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles