PM’s chopper is all-weather, chose not to fly: Punjab govt ప్రధాని తన అల్ వెదర్ ఛాపర్ ను ఎందుకు వాడలేదు: పంజాబ్ ప్రభుత్వం

Pm modi s chopper is all weather chose not to fly punjab govt on security breach

modi punjab rally, modi ferozepur, modi, pm modi, assembly elections 2022, assembly elections latest news, assembly elections covid19 guidelines, Punjab assembly elections, Punjab elections, BJP, PM Modi, Congress, Priyanka Gandhi, Rahul Gandhi, election commission, election press conference, election 2022, state assembly election 2022, assembly election 2022 dates, punjab election 2022, punjab assembly election 2022 dates, punjab election 2022 schedule, punjab state assembly election 2022 dates, punjab assembly election 2022 schedule, election 2022 news

The Congress accused Prime Minister Narendra Modi and the BJP of defaming and insulting Punjab and Punjabiat by playing petty politics on the issue of "security breach" during his visit to the poll-bound state.

ప్రధాని తన అల్ వెదర్ ఛాపర్ ను ఎందుకు వాడలేదు: పంజాబ్ ప్రభుత్వం

Posted: 01/07/2022 06:28 PM IST
Pm modi s chopper is all weather chose not to fly punjab govt on security breach

పంజాబ్ లో ప్ర‌ధాని మోదీ కాన్వాయ్ కు భ‌ద్ర‌తా వైఫ‌ల్యం ఏర్ప‌డిన అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరింది. అంత‌ర్జాతీయంగా దేశ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే చర్య జరిగిందని.. ఇది కేవలం శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య కాదని, జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన‌ వ్యవహారంగా చూడాలని కూడా పిటీషనర్ పేర్కోన్న విషయం తెలిసిందే. కాగా సుప్రీంకోర్టు కూడా ప్రధాని మోడీకి సంబంధించిన ట్రావెల్ రికార్డును భద్రపర్చాలని ఆదేశించిన విషయం కూడా తెలిసిందే. ఈ విషయంలో ఇంటా బయట విమర్శలను ఎదుర్కోంటున్న పంజాబ్ ప్రభుత్వం ఇక భద్రతా డొల్లతనంపై ఎదురు ప్రశ్నను సంధించింది.  

మోదీ భ‌ద్ర‌త‌లో తలెత్తిన లోపంపై పంజాబ్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధాని ప్ర‌యాణించే హెలికాప్ట‌ర్ ఎలాంటి వాతావ‌ర‌ణంలోనైనా ప్ర‌యాణించే సామ‌ర్థ్య‌మున్న హెలికాప్ట‌ర్ అని, (ఆల్ వెద‌ర్ హెలికాప్ట‌ర్‌) అయినా దానిని ఉప‌యోగించ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని పంజాబ్ స‌ర్కార్ దుయ్య‌బ‌ట్టింది. అంతేకాకుండా ప్ర‌ధాని ప్ర‌యాణించే మార్గం కొండ‌లు, గుట్ట‌లున్న ప్రాంతం కూడా కాద‌ని, అయినా ఆ హెలికాప్ట‌ర్‌ను ఉప‌యోగించ‌లేద‌ని, స‌భ‌కు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నార‌ని పంజాబ్ స‌ర్కార్ ఓ జాతీయ న్యూస్ ఛానల్‌తో వ్యాఖ్యానించింది.

కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ కూడా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ పాకిస్థాన్‌ కాల్పుల పరిధిలో ఉన్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడిన మనీష్‌ తివారీ, ప్రధాని భద్రతను మరొకరి భద్రతతో పొల్చడం సరికాదన్నారు. ‘ప్రధాని కాన్వాయ్ ఎక్కడ ఆగింది. ఇండో-పాక్ సరిహద్దు నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అది ఉంది. సాధారణంగా సరిహద్దు వద్ద పాకిస్థాన్‌ భారీ ఫిరంగిని మోహరిస్తుంది. మన తుపాకులు కూడా సరిహద్దులో ఉన్నాయి. ఫిరంగి దళాల పరిధి 35-36 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ. దేశ ప్రధానిని మరొకరి భద్రతతో పోల్చడం నా మనస్సాక్షికి తగినది కాదు’ అని అన్నారు.

అయితే ప్రధాని మోదీ భద్రతలో ఎలాంటి లోపం లేదని మనీష్ తివారీ తెలిపారు. రైతుల నిరసన జరుగుతున్నందు వల్లనే ప్రధాని కారును 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై నిలిపివేశారని చెప్పారు. ఇది భద్రతా లోపం కిందకు రాదన్నారు. అయితే పాకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ప్రధాని మోదీ ఉన్నందున ఆయనకు ఆ మేరకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ భద్రతా లోపంపై కేంద్రప్రభుత్వంలో పాటు బీజేపి నేతలు పంజాబ్ లోని చెన్ని ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా, రైతులు అందోళనలు చేస్తున్న మార్గాన్ని ఎస్పీజీ బలగాలు ఎలా  ఎంచుకున్నాయన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles