పంజాబ్ ఆమ్ఆద్మీ పార్టీలో ఒక్కసారిగా విభేదాలు పొడసూపాయి. ఎన్నికల రణక్షేత్రం అసన్నమైన తరుణంలో తమకు టికెట్లు కేటాయించకపోవడంతో విభేదాలు తలెత్తాయి. పార్టీ కోసం అహర్నిషలు కష్టపడుతున్న తమను పక్కనబెట్టడంపై అశావహులతో పాటు వారి అనుచరుణులు పార్టీ అధిష్టానంపై తిరగబడ్డారు. పార్టీ వ్యవస్థాపన నాటి నుంచి ఇంత కాలం పనిచేసిన తమకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తితో రగలిపోయిన అశవహులు పంజాబ్ అప్ కన్వీనర్ రాఘవ్ చద్దాపై తిరుగుబాటు ఎగురవేశారు.
అంతా సవ్యంగానే నడుస్తుందనుకుంటున్న సమయంలో టిక్కెట్ల విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం ఆప్ సీనియర్ నేత, పంజాబ్ ఎన్నికల కో ఇన్‌ఛార్జీ రాఘవ్ చద్దా మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఆగ్రహించిన అసంతృప్తి నేతలు కార్యాలయం బయటే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఒకానోక దశలో సమావేశ మధ్యలోనే మీడియా ప్రతినిధుల సమక్షంలోనే టిక్కెట్ల విషయంలో తీవ్ర అసంతృప్తికి లోనైన నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. రాఘవ్ చద్దాను ఘెరావ్ చేసి తమ వ్యతిరేకతను చాటుకున్నారు.
దీంతో ఆయనతో పాటుగా వచ్చిన అప్ నేతలకు.. అసంతృప్తి నేతలకు మధ్య ఘర్షణకు ప్రెస్ క్లబ్ వేదికగా మారింది. ఆమ్ఆద్మీ నేతలు ఒకరిపై ఒకరు ముష్ఠి ఘాతాలకు దిగారు. దీంతో అక్కడ రణరంగంగా మారిపోయింది. ఆప్ సీనియర్ నేతలైన శివదయాల్ మాలీ, సంజీవ్ శర్మ, జోగిందర్ పాల్ శర్మ మద్దతు దారులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి ఆప్‌లో చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని, వారినే అక్కున చేర్చుకుంటున్నారని ఈ వర్గీయులు రాఘవ్ చద్దాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more