‘Lifelong cabinet status’ on Cong leader Pratapsingh Rane కాంగెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ రాణేకు జీవితకాల క్యాబినెట్ హోదా..

Goa govt to confer lifelong cabinet status on cong leader pratapsingh rane

Goa, lifelong cabinet status, Pratapsingh Rane, Goa govt, BJP, Congress, Goa elections, Goa polls, Goa BJP, Goa Congress leader, pramod sawant

The ruling BJP government will confer “lifelong cabinet status” on veteran Congress leader and MLA Pratapsingh Rane, Goa Chief Minister Pramod Sawant announced in a move seen as an attempt to convince him not to contest the upcoming elections.

కొత్త సంప్రదాయానికి గోవా సర్కార్ శ్రీకారం.. రాణేకు జీవితకాల క్యాబినెట్ హోదా..

Posted: 01/07/2022 05:12 PM IST
Goa govt to confer lifelong cabinet status on cong leader pratapsingh rane

గోవా అసెంబ్లీ సరికొత్త నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. గోవా అసెంబ్లీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులకు, మాజీ స్పీకర్లకు, భవిష్యత్తులోనూ జీవిత కాల క్యాబినెట్ హోదా ఇచ్చేందుకు నాంది పలికింది. శాసనసభ్యులుగా 50 ఏళ్లు పూర్తి చేసుకన్న ప్రతీ సభ్యుడికి ఈ గౌరవాన్ని అందించాలని పూనుకున్నామన్నారు. 50 ఏళ్లుగా సదరు సభ్యులు రాష్ట్రం కోసం అందించిన విశిష్ట సేవలకు ఈ క్యాబినెట్ హోదాతో వారిని సత్కరించుకునే అవకాశం లభించడం తమ రాష్ట్రానికి దక్కిన అరుదైన అవకాశమని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు.

ఈ క్రమంలో తొలిసారిగా ఈ హోదాను అందుకుంటోన్న వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ రాణె నిలువనున్నారు. రాష్ట్రానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు శాశ్వత (జీవిత కాల) కేబినెట్ మంత్రి హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని శాసనసభ్యుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోవా రాష్ట్రానికి రాణె అందించిన గొప్ప సేవలను గుర్తిస్తూ జీవిత కాలం పాటు కేబినెట్ హోదా ఇవ్వనున్నట్టు సావంత్ తెలిపారు.

87 ఏళ్ల రాణె 1987 నుంచి 2007 మధ్య నాలుగు పర్యాయాలు గోవాకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. స్పీకర్ గానూ పనిచేశారు. ఈ నిర్ణయం పట్ల రాణె తనయుడు, ప్రస్తుత బీజేపీ సర్కారులో వైద్య మంత్రిగా పనిచేస్తున్న విశ్వజిత్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘50 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా, స్పీకర్ గా, ముఖ్యమంత్రిగా అందించిన సేవలకు ఇంతకంటే గొప్ప గౌరవం ఏదీ లేదు. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు ధన్యవాదాలు’’ అని విశ్వజిత్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles