భారత ప్రధాని మోదీకి కనీవినీ ఎరుగని భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా వేలాది మంది సాయుధబలగాలు ఆయనకు భద్రత కల్పిస్తుంటాయి. అయితే ఈరోజు ఆయన పంజాబ్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించింది. ఆయన ప్రయాణిస్తున్న సమయంలో నిరసనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ పై 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాంతో మోదీ అక్కడే కారులో ఉండిపోయారు. ఆ తర్వాత మోదీ కాన్వాయ్ తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై తక్షణమే నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ లోని జాతీయ అమరవీరుల స్మారకం ఉన్న హుస్సేనివాలకు మోదీ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఫ్లైఓవర్ వరకు ప్రధాని కాన్వాయ్ చేరుకుంది. అయితే మోదీ కాన్వాయ్ ను అక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే కాన్వాయ్ ని ఆపేశారు. దీంతో ఫ్లైఓవర్ పై కారులోనే మోదీ వుండిపోయారు. ఇది ప్రధాని భద్రతకు సంబంధించి అతిపెద్ద వైఫల్యమని కేంద్ర హోంశాఖ వ్యాఖ్యానించింది. వాతావరణం అనుకూలంగా లేని కారణంతో చివరి నిమిషంలో జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని ఎంపిక చేశామన్నారు.
ఈ ప్రయాణానికి సంబంధించిన ప్లాన్ లో మార్పులు చేశామని.. రోడ్డు మార్గం గుండా అక్కడకు వెళ్లేందుకు ప్లాన్ మారిందని... అది 2 గంటల రోడ్డు ప్రయాణమని కేంద్ర హోంశాఖ తెలిపింది. భద్రతా ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయంటూ పంజాబ్ డీజీపీ నుంచి కర్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయల్దేరిందని చెప్పింది. రోడ్డు మార్గంలో ప్రధాని ప్రయాణిస్తున్నారని తెలిసినా పంజాబ్ ప్రభుత్వం అదనపు సెక్యూరిటీ ఏర్పాట్లను చేయలేదని తెలిపింది. ప్రయాణానికి విఘాతం కలిగిన నేపథ్యంలో మోదీ కాన్వాయ్ భటిండా ఎయిర్ పోర్టుకు తిరిగి వచ్చిందని వెల్లడించింది. ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని... పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించామని పేర్కొంది.
ప్రధాని పంజాబ్ పర్యటన సందర్భంగా రైతులు తమ నిరసనను వ్యక్తం చేయడంతో 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్పైనే ప్రధాని మోదీ కాన్వాయ్ నిలిచిపోయింది. ఈ వ్యవహారంపై బీజేపీ పంజాబ్ ప్రభుత్వంపై భగ్గుమంది. ఇక.. పంజాబ్ సీఎం చెన్నీ కూడా అంతే స్థాయిలో బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని కాన్వాయ్ విషయంలో పంజాబ్ సీఎం చన్నీకి ఫోన్ చేస్తే, కనీసం అందుబాటులోకి కూడా రాలేదని తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఓటమి తప్పదన్న భయంతోనే పంజాబ్ సర్కార్ ప్రధాని మోదీ కార్యక్రమాన్ని విఫలం చేయడానికి ప్రయత్నాలు చేసిందని నడ్డా మండిపడ్డారు.
ప్రధాని మోదీ భద్రత విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలపై పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ స్పందించారు. ప్రధాని భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి అలసత్వం వహించలేదని ఆయన స్పష్టం చేశారు. భటిండా నుంచి ఫిరోజ్ పూర్కు రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించాలని చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. ఇక తనను ఇటీవల కలిసిన కొందరు సన్నిహితులు కరోనా పాజిటివ్ కు గురయ్యారని.. ఆ కారణంగా తాను ప్రధానిని ఆహ్వానించేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లలేదని చెప్పుకోచ్చారు. ‘రాజకీయాల కారణాల రీత్యానే తమ ప్రభుత్వంపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది’ అంటూ చన్నీ మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more