Centre issues revised guidelines for home isolation కరోనా హోమ్ ఐసోలేషన్ కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Home isolation cut to 7 days from 10 in latest covid guidelines

Covid-19, Covid update, home isolation, Union Health Ministry, isolation guidelines, Omicron cases, covid home isolation, mild cases, COVID-19 home isolation, Coronavirus, COVID home isolation days, India home isolation guidelines, Covid isolation guidelines, India Covid update, India Covid cases

Union Health Ministry issued revised guidelines for home isolation of mild, asymptomatic Covid-19 patients as Omicron cases surge across India. “Patients under home isolation will stand discharged & end isolation after atleast 7 days have passed from testing positive & no fever for 3 successive days. There is no need for re-testing after the home isolation period is over," the health ministry said.

కరోనా హోమ్ ఐసోలేషన్ కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Posted: 01/05/2022 06:45 PM IST
Home isolation cut to 7 days from 10 in latest covid guidelines

ప్రపంచంతోపాటు దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతుంటడం, కరోనా థర్డ్‌ వేవ్‌పై భయాందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హోమ్‌ ఐసొలేషన్‌ నియమాలను సవరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోమ్‌ ఐసొలేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. స్వల్ప లక్షణాలుండి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు ఏడు రోజులపాటు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటే చాలని తెలిపింది. ఏడు రోజుల తర్వాత లేదా వరుసగా మూడు రోజులపాటు జ్వరం లేనట్లతేనే హోమ్‌ ఐసొలేషన్‌ను ముగించవచ్చని చెప్పింది.

అలాగే హోమ్‌ ఐసొలేషన్‌ గడువు ముగిసిన తర్వాత మరోసారి కరోనా టెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఒమిక్రాన్‌ సోకిన రోగులకు ఆసుపత్రిలో చేరేంతగా అనారోగ్య పరిస్థితి లేకపోవడంతో వైద్య మార్గదర్శకాల మేరకు కనీసం వారం రోజులు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు ఇది పది రోజులు వరకు ఉండగా తాజాగా దీనిని కుదించింది.

కేంద్రం జారీ చేసిన హోమ్‌ ఐపొలేషన్‌ కొత్త మార్గదర్శకాలు:

* వైద్యపరంగా తేలికపాటి లక్షణాలు ఉంటే.. లక్షణాలున్న కేసుగా, లక్షణాలు లేకపోతే లేని కేసుగా పరిగణించాలి.
* టెస్టింగ్, క్లినికల్ మేనేజ్‌మెంట్, కోసం ఆ వ్యక్తి కుటుంబానికి నిర్దేశించిన కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్‌ ఇవ్వాలి.
* అలాంటి రోగులుకు ఆక్సిజన్‌ స్థాయిలు 93 శాతంపైగా ఉంటే స్వీయ ఐసొలేషన్‌లో ఉంచాలి.
* వారితో కాంటాక్ట్‌ అయిన వ్యక్తులు క్వారంటైన్‌లో ఉంచాలి.
* పూర్తిగా టీకా పొందిన సంరక్షకుడు మాత్రమే వారికి సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండాలి.
* 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, బిపి, షుగర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి కోవిడ్ సోకితే.. వైద్యుడి సూచనపై మాత్రమే హోమ్‌ ఐసొలేషన్‌కు అనుమతించాలి.
* హెచ్‌ఐవి, ట్రాన్స్‌ప్లాంట్ గ్రహీతలు, క్యాన్సర్ థెరపీలో ఉన్న రోగులను వైద్యుడి అనుమతి లేకపోతే హోమ్ ఐసోలేషన్‌కు సిఫార్సు చేయకూడదు.
* కరోనా రోగి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు ఆ నివాసంలో ఉన్న ఇతర సభ్యులంతా హోమ్ క్వారంటైన్ నియమాలు పాటించాలి.
* హోమ్‌ ఐసొలేషన్ రోగులు ట్రిపుల్ లేయర్ క్లినికల్ మాస్క్‌లు లేదా ఎన్‌-95 మాస్క్ వాడాలి.
* పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్‌ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించుకుకోవాలి
* కోవిడ్-19 రోగులు పుష్కలంగా నీరు, ద్రవాలు తాగాలి.
* తరచుగా చేతుల పరిశుభ్రత, శానిటైజేషన్ నిబంధనలను పాటించాలి.
* హోమ్ ఐసోలేషన్ కేసులను జిల్లా యంత్రాంగం ప్రతిరోజూ పర్యవేక్షించాలి.
* కరోనా సోకిన వ్యక్తులను కాంటాక్ట్‌ అయిన వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతే కోవిడ్ పరీక్ష అవసరం లేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles