Covid: 28 districts reported more than 10% weekly positivity దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్.. 60 వేలకు చేరిన కోవిడ్ కేసులు

Covid daily cases in india surge 56 to 58 000 highest 1 day spike

Coronavirus, Covid, Covid vaccine, First Omicron death in India, Omicron death in Maharashtra, first omicron death in pune, Covid vaccine registration, omicron, covid cases in india, omicron virus, corona cases in india, corona update, coronavirus india, omicron symptoms, covid cases in bangalore, corona update in india, lockdown news, coronavirus news, norovirus, karnataka news, india coronavirus, coronavirus in india, covid cases in india in last 24 hours today, omicron, Omicron variant, omicron variant covid, New variant Omicron, omicron virus, omicron virus symptoms, omicron virus variant, omicron virus india, omicron virus variant, Covid guidelines

A total of 2,135 cases of Omicron variant of coronavirus have been detected across 24 states and UTs so far, out of which 828 have recovered or migrated, according to the Union health ministry data. India saw a single-day rise of 58,097 new coronavirus infections, the highest in around 199 days, taking the country’s total tally of cases to 3,50,18,358, while the active cases were recorded above 2 lakh after around 81 days.

దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్.. 60 వేలకు చేరిన కోవిడ్ కేసులు

Posted: 01/05/2022 04:18 PM IST
Covid daily cases in india surge 56 to 58 000 highest 1 day spike

దేశంలో నూతన సంవత్సరం వేడుకల వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి మూడవదశ ముపుతో విరుచుకుపడుతోంది. ఇది సంక్రాంతి నుంచి మరింత వేగం పుంజుకుని ఫిబ్రవరి 3 నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని ఇప్పటికే నిపుణులు అంచనావేశారు. మహారాష్ట్ర తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కొత్త వేరియంట్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రోజు దాదాపు 10 వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్ వెల్లడించారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 10 శాతానికి చేరనుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఇది మూడో వేవ్‌కు సంకేతం కాగా ఢిల్లీలో మాత్రం ఇది ఐదో వేవ్ గా ఆయన పేర్కోన్నారు.

ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. దీనిని తేలిగ్గా తీసుకోరాదని కూడా ఆయన సూచించారు. అయితే అందోళన చెందాల్సిన స్థాయిలో లక్షణాలు, తీవ్రత లేకపోవడం కొంత ఊరట కలిగించే విషయమే అయినా.. ఇది దశలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించిన వారు తప్పితే.. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఒమిక్రాన్ దరి చేరడం ఖాయమని చెప్పారు. బౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి నియమాలు పాటిస్తేనే ఒమిక్రాన్ దరి చేరదని చెప్పారు. వాక్సీన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40 శాతం పడకలు కొవిడ్ బాధితుల కోసం రిజర్వ్‌ చేసినట్లు చెప్పారు.

ఢిల్లీలో క్రితం రోజున 5,481 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు రోగులు కరోనా బారినపడి మరణించారు. ఇప్పటివరకూ ఢిల్లీలో 14,63,701 మందికి వైరస్ సోకగా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన 464 మంది పడ్డారు. ఢిల్లీలో వచ్చేవారం నాటికి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 15 నాటికి రోజువారీ కేసులు 20వేల నుంచి 25వేలకు పెరిగే అవకాశముందని, ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరుగుతాయని ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కేసుల పెరుగుదలకు డెల్టా, ఒమిక్రాన్‌.. రెండు వేరియంట్లు కారణమని తెలిపాయి. గత రెండు రోజులుగా ఆసుపత్రుల్లో చేరికలు కూడా పెరగడం ఆందోళనలకు గురిచేస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనావైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అంతకుముందు రోజు నమోదైన 30వేల కొత్త కేసులు గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా రెట్టింపు సంఖ్యకు చేరకున్నాయి. ఇవాళ ఒక్కసారిగా 58 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. కేసుల పెరుగుదలకు కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు రెండు వేల మార్కు దాటేశాయి. దీంతో రానున్న రెండు వారాల్లో ఈ కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరొచ్చని డబ్యూహెచ్ఓ ప్రిన్సిఫల్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles