Bulli Bai App mastermind detained from Uttarakhand పోలీసుల కస్టడీలో బుల్లీ భాయ్ యాప్ ‘మాస్టర్ మైండ్’.!

Bulli bai app case shweta singh 18 year old mastermind detained from uttarakhand

Bulli bai app case, photos of Muslim women, prominent Muslim women, journalists, vulgar comments, Mumbai police cyber cell, app, mumbai police, bulli bai, mumbai, Vishal Kumar Jha, , bengaluru, shweta singh, uttarakhand, khalsa, Crime

The Mumbai Police have arrested 21-year-old engineering student Vishal Kumar Jha, from Bengaluru and detained an 18-year-old woman Shweta Singh from Uttarakhand in the Bulli bai app case, where photos of Muslim women were allegedly misused and put online and abusing the Muslim women in it.

పోలీసుల కస్టడీలో బుల్లీ భాయ్ యాప్ ‘మాస్టర్ మైండ్’ శ్వేతాసింగ్.!

Posted: 01/05/2022 03:01 PM IST
Bulli bai app case shweta singh 18 year old mastermind detained from uttarakhand

సమాజంలోని గౌరవప్రదమైన పదవులలో వున్న ముస్లిం మహిళల ఫోటోలను మార్పింగ్ చేసి.. వారిని బుల్లి బాయ్ అనే యాప్ ద్వారా వేలానికి పెట్టిడంతో పాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆభియోగాలు ఎదర్కోంటున్న యాప్ మాస్టార్ మైండ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బుల్లీభాయ్ యాప్ వెనుక సూత్రధారిగా వున్న 18 ఏళ్ల బాలిక శ్వేతాసింగ్ అని ముంబై సైబర్ సెల్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 1న తమ అభ్యంతరకర ఫోటోల, అనుచిత వ్యాఖ్యలు ఈ యాప్ లో కనిపిస్తున్నాయని పలువురు మహిళలు పిర్యాదుతో కదిలిన ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ కేసులో సూత్రధారిగా బావిస్తున్న శ్వేతాసింగ్ అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరాఖండ్ లోని ఉదంసింగ్ నగర్ జిల్లా రుద్రపూర్ కు చెందిన శ్వేతాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అమె ఇంటర్ విద్యను పూర్తి చేసి.. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షలకు సన్నధం అవుతున్నట్లు తెలిసింది. ఇక తల్లిదండ్రులను కోల్పోయిన ఈ అమ్మాయి పేదరికం నుంచి బయటపడేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుందని తెలుస్తోంది. ఈ అమ్మాయికి ఇద్దరు సోదరీమణులు వుండగా, ఎనమిదవ తరగతి చదవుతున్న ఓ తమ్ముడు కూడా వున్నాడని పోలీసులు తెలిపారు. కాగా ఉత్తరాఖండ్ నుంచి ట్రాన్సిట్ రిమాండ్ అమెను ముంబైకి తీసుకువచ్చిన పోలీసులు అమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు.

100 మంది వరకు ముస్లిం మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి.. బుల్లీభాయ్ యాప్ లోకి అప్ లోడ్ చేయడమే కాకుండా, వేలానికి పెట్టినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై జనవరి 1న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ఇదివరకే మయాంక్ రావల్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా సూత్రదారి శ్వేతా సింగ్ తో పాటు బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల విశాల్ కుమార్ ఝాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకూ ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

కాగా వీరికి యాప్ రూపోందించేందుకు సహకరించిన వారితో పాటు ట్విట్టర్ లో పోస్టు చేసేందుకు సహకరించిన వారిని కూడా త్వరలోనే అరెస్లు చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్వేతాసింగ్ ను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ కు చెందిన జియూ అనే సోషల్ మీడియా స్నేహితుడి సూచనల మేరకు ‘జట్ ఖల్సా07’ అనే నకిలీ ఖాతాను ఆమె తెరిచింది. ఈ ఖాతా ఆధారంగా బుల్లీభాయ్ యాప్ లో కంటెంట్ పోస్ట్ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఉత్తరాఖండ్ డీజీపి అశోక్ కుమార్ మాత్రం శ్వేతాసింగ్ పేదరికం నుంచి బయటకు వచ్చేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుని ఉంటుందని భావిస్తున్నారు. కేవలం డబ్బులు ఆర్జించేందుకు మాత్రమే అమె ఇలా చేసి ఉంటుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : app  mumbai police  bulli bai  mumbai  Vishal Kumar Jha  Student  bengaluru  shweta singh  uttarakhand  khalsa  Crime  

Other Articles